Nithiin Marriage Date Fixed: ఈ నెల 26న నితిన్ పెళ్లి?

Nithiin Marriage Date Fixed: ఈ నెల 26న నితిన్ పెళ్లి?
x
Highlights

Nithiin Marriage Date Fixed: లాక్ డౌన్ సమయంలో టాలీవుడ్ కి సంబంధించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు, యంగ్ హీరో నిఖిల్ , జబర్దస్త్ ఆర్టిస్ట్ మహేష్ ల పెళ్లిళ్లు అయిపోయాయి.

Nithiin Marriage Date Fixed: లాక్ డౌన్ సమయంలో టాలీవుడ్ కి సంబంధించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు, యంగ్ హీరో నిఖిల్ , జబర్దస్త్ ఆర్టిస్ట్ మహేష్ ల పెళ్లిళ్లు అయిపోయాయి. అయితే ఎప్పుడెప్పడా అని ఎదురుచూస్తున్న యంగ్ హీరో నితిన్ పెళ్లి ఖరారు అయినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 26న అతికొద్ది మంది సమక్షంలో నితిన్ తన ప్రేయసి షాలిని ని పెళ్లి చేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ముందుగా వీరి వివాహాన్ని హైదరాబాదులోని శివారుల్లో ఉన్న ఫామ్ హౌస్‌లో నిర్వహించాలని కుటుంబ సభ్యులు భావించారు..కానీ ఇప్పుడు ఆ పెళ్లిని వధువు ఇంటి వద్దే ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది.. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఇక నితిన్ కి తన ప్రేయసి షాలినితో ఇప్పటికే నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.. ఏప్రిల్ 16 న దుబాయిలో వీరి వివాహం చేయాలని ముందుగా ఇరు కుటుంబ పెద్దలు అనుకున్నారు. ఈ తరుణంలో విదేశాల్లో కరోనా వ్యాప్తి పెరగడంతో పెళ్లిని కూడా వాయిదా వేశారు.

ఇక నితిన్ సినిమాల విషయానికి వచ్చేసరికి ఈ ఏడాది ఫిబ్రవరిలో భీష్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ భారీ విజయాన్ని అందుకున్నాడు.. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. రష్మీక మందన్నా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తర్వాత గాంధీ మెర్లపాక దర్శకత్వంలో అందుధాన్ రీమెక్, విభిన్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో, కృష్ణ చైతన్య దర్శకత్వంలో మరో సినిమాని లైన్ లో పెట్టాడు నితిన్..

Show Full Article
Print Article
Next Story
More Stories