Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాలో నటించబోతున్న నితిన్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ గా నితిన్

Dhatripriya
Updated on: 12 April 2023 7:31 PM IST
Nithin Is Going To Act In Pawan Kalyans Movie
X

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాలో నటించబోతున్న నితిన్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఇండస్ట్రీలో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా హీరో నితిన్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చాలా వరకు నితిన్ సినిమాలలో పవన్ కళ్యాణ్ సినిమా రిఫరెన్స్ లు కనిపిస్తూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ పాటలను కూడా నితిన్ కొన్నిసార్లు వాడేసాడు. తాజాగా ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ చేయబోతున్నాడు నితిన్. డైరెక్టర్ వక్కంతా వంశీ దర్శకత్వంలో నితిన్ హీరోగా త్వరలో ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నితిన్ క్యారెక్టర్ చాలా విభిన్నంగా ఉండబోతుందట.

ఈ సినిమాలో నితిన్ ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా కనిపించబోతున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలో నితిన్ కి పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న ఒక సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ గా నటించే అవకాశం వస్తుందట. మరి వెండితెరపై పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు లేదో తెలియదు కానీ నితిన్ మాత్రం పవన్ కళ్యాణ్ సినిమాలో నటించబోతున్న జూనియర్ ఆర్టిస్ట్ గా కనిపించబోతున్నాడు.

ఒకవేళ పవన్ కళ్యాణ్ ను ఒక చిన్న కామియో కోసం తీసుకురావడం కూడా నితిన్ కి అంతా కష్టమైన పనేమీ కాదు. నితిన్ అడిగితే పవన్ కళ్యాణ్ అంత త్వరగా కాదనరు. శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కోసం "జూనియర్" లేదా "సైతాన్" అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Dhatripriya

Dhatripriya

Next Story