వక్కంతం వంశీ తో సినిమా కోసం మార్పులు చెప్పిన నితిన్

Nithiins Movie With Vakkantham Vamsi Goes on Floors
x

వక్కంతం వంశీ తో సినిమా కోసం మార్పులు చెప్పిన నితిన్

Highlights

Nithiin: గత కొంతకాలంగా యువ హీరో నితిన్ కెరియర్లో ఒక్క సూపర్ హిట్ సినిమా కూడా లేదు.

Nithiin: గత కొంతకాలంగా యువ హీరో నితిన్ కెరియర్లో ఒక్క సూపర్ హిట్ సినిమా కూడా లేదు. ఈ మధ్యనే "మాచర్ల నియోజకవర్గం" సినిమాతో ప్రేక్షకుల మందికి వచ్చిన నితిన్ ఆ సినిమాతో కూడా మెప్పించలేకపోయారు. అయితే ఈ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడే నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక సినిమాని మొదలు పెట్టారు. రైటర్ గా మంచి పేరు తెచ్చుకున్న వక్కంతం వంశీ అల్లు అర్జున్ హీరోగా నటించిన "నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా" సినిమాతో దర్శకుడిగా మారారు. కానీ మొదటి సినిమాతో అంతగా మెప్పించలేకపోయారు.

అయితే తాజాగా ఇప్పుడు నితిన్ వక్కంతం వంశీతో చేయాల్సిన సినిమాని క్యాన్సిల్ చేసేసారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వక్కంతం వంశీ నితిన్ తో సినిమా క్యాన్సిల్ అవ్వలేదని త్వరలోనే షూటింగ్ కూడా మొదలవుతుందని చెప్పుకొచ్చారు. "మాచర్ల నియోజకవర్గం" సినిమాతో సూపర్ హిట్ అందుకోవాలని కలలు కన్న నితిన్ కి నిరాశ మాత్రమే ఎదురయింది.

వక్కంతం వంశీ సినిమాతో అయినా హిట్ కొట్టాలని ఫిక్స్ అయిన నితిన్ స్క్రిప్ట్ లో బోలెడు మార్పులు చేర్పులు చెప్పారట. ఇక నితిన్ చెప్పిన మార్పులన్నీ చేసిన తర్వాత వక్కంతం వంశీ మళ్లీ కథ వినిపించగా నితిన్ కూడా వెంటనే ఓకే చెప్పేసారట. డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకోలేకపోయినప్పటికీ వక్కంతం వంశీకి రైటర్ గా మంచి అనుభవం ఉంది. రైటర్ గా "కిక్", "టెంపర్" వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అందించారు. ఇక నితిన్ సినిమాతో దర్శకుడిగా కూడా మంచి పేరు తెచ్చుకుంటారో లేదో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories