ఎమోషనల్ సినిమాతో యువ హీరో

ఎమోషనల్ సినిమాతో యువ హీరో
x
Highlights

'అ ఆ' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ 'లై', 'చల్ మోహన్ రంగా', 'శ్రీనివాస కళ్యాణం' వంటిమూడు డిజాస్టర్ల వల్ల నితిన్ మార్కెట్ బాగా పడిపోయింది...

'అ ఆ' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ 'లై', 'చల్ మోహన్ రంగా', 'శ్రీనివాస కళ్యాణం' వంటిమూడు డిజాస్టర్ల వల్ల నితిన్ మార్కెట్ బాగా పడిపోయింది అని చెప్పుకోవచ్చు. ఇక తాజాగా నితిన్ తన ఆశలన్ని వెంకీ కుడుముల దర్శకత్వంలో చేస్తున్న 'భీష్మ' సినిమాపైనే పెట్టుకున్నాడు. తాజాగా నితిన్ క్రియేటివ్ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. నితిన్-చంద్రశేఖర్ ఏలేటి సినిమా లో ఒక సోషల్ మెసేజ్ ఉంటుందని తెలుస్తోంది.

ఈ సినిమా ఒక ఫుల్ లెన్త్ ఎంటర్టైనర్ అయినప్పటికీ సినిమాలో ఒక సోషల్ మెసేజ్ కూడా ఉండబోతోందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. సినిమాలో ఆర్గాన్ డొనేషన్ కాన్సెప్ట్ హైలెట్ కాబోతోంది అని వార్తలు బయటకు వస్తున్నాయి. అంతేకాక ఎంటర్టైన్మెంట్ తో పాటే ఈ సినిమాలో ఎమోషన్లు కూడా ఎక్కువగా ఉంటాయని కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టిస్తాయి అని తెలుస్తోంది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. మరి ఈ సినిమాతో నితిన్ ఎంత వరకు మెప్పిస్తాడో వేచి చూడాల్సి ఉంది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories