నితిన్ కోసం "భీమ్లా నాయక్" డైరెక్టర్

*నితిన్ కోసం "భీమ్లా నాయక్" డైరెక్టర్

Rama Rao
Updated on: 22 Jun 2022 3:45 PM IST
Nithiin to team up with Saagar Chandra | Tollywood News
X

నితిన్ కోసం "భీమ్లా నాయక్" మ్యూజిక్ డైరెక్టర్

Nithiin: చెక్, మేస్ట్రో వంటి విభిన్న జోనర్ లో సినిమాలు చేసిన నితిన్ తాజాగా ఇప్పుడు "మాచర్ల నియోజకవర్గం" అనే పొలిటికల్ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి మరియు క్యాథరిన్ తెరిసా లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక సినిమాని సైన్ చేశారు నితిన్. అల్లు అర్జున్ హీరోగా నటించిన "నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా" సినిమాతో దర్శకుడిగా మారిన వంశీ ఆ సినిమాతో పెద్దగా మెప్పించలేకపోయారు. మరి నితిన్ సినిమాతో ఎంతవరకు హిట్ అందుకుంటారో వేచి చూడాలి.

మరోవైపు నితిన్ వక్కంతం వంశీ సినిమా తర్వాత సాగర్ చంద్ర తో సినిమా చేసే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అయితే "భీమ్లా నాయక్" సినిమాకి దర్శకత్వం వహించిన సాగర్ చంద్ర ఈ సినిమా తో బాగానే మెప్పించాడు కానీ క్రెడిట్ మాత్రం సాగర్ ఖాతాలో పడలేదు. పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ మీద ప్రశంసల వర్షం కురిపించిన ప్రేక్షకులు సాగర్ చంద్ర ను మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. కానీ తాజాగా ఇప్పుడు నితిన్ సాగర్ చంద్ర తో సినిమా చేయడానికి సిద్ధం అవుతుండడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Rama Rao

Rama Rao

Next Story