నితిన్ 'రంగ్ దే' రిలీజ్ డేట్ ఫిక్స్

నితిన్  రంగ్ దే రిలీజ్ డేట్ ఫిక్స్
x
Highlights

నితిన్ హీరోగా వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'రంగ్ దే'. రొమాంటిక్‌ లవ్‌ స్టోరిగా ఈ సినిమాను రూపొందించారు. నితిన్ సరసన మహానటి...

నితిన్ హీరోగా వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'రంగ్ దే'. రొమాంటిక్‌ లవ్‌ స్టోరిగా ఈ సినిమాను రూపొందించారు. నితిన్ సరసన మహానటి ద్వారా జాతీయ పురస్కారం అందుకున్న నటి కీర్తి సురేష్ న‌టిస్తున్నారు. కొత్త సంవత్సరం కానుక ఈ సినిమాకు సంబంధించి అప్‌డేట్‌‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. రంగ్‌ దే చిత్రాన్ని మార్చి 26న థియేటర్లలతో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ పూర్తయ్యింది. పాటలు, సన్నివేశాలు అన్ని కంప్లీట్‌ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మేరకు దర్శకుడు వెంకీ అట్లూరి ట్విటర్‌లో షేర్‌ చేశారు.

దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న‌రేష్‌, వినీత్‌, రోహిణి, వెన్నెల కిషోర్‌, గాయ‌త్రి ర‌ఘురామ్ ముఖ్యపాత్ర‌ల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలోని ఒక రొమాంటిక్ సాంగ్‌ను `ఏమిటో ఇది వివ‌రించ‌లేనిది.. మ‌ది ఆగ‌మ‌న్న‌ది త‌నువాగ‌న‌న్న‌ది…` అంటూ సాగే ప‌ల్ల‌వి ఇప్పటికే రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దీనిని శ్రీ‌మ‌ణి రచించగా... హ‌రిప్రియ‌, క‌పిల‌న్ లు ఆల‌పించారు.




Show Full Article
Print Article
Next Story
More Stories