Rang De Movie: 'చూసి నేర్చుకోకు' సాంగ్ మేకింగ్ వీడియో హల్‌చల్‌

Rang De Movie: నితిన్, కీర్తి సురేశ్ హీరోహీరోయిన్లగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'రంగ్​ దే'.

Samba Siva Rao
Updated on: 23 March 2021 6:21 PM IST
Nithiin Rang De​ Movie Making Video Goes Viral
X

 'రంగ్​ దే'

Rang De Movie: నితిన్, కీర్తి సురేశ్ హీరోహీరోయిన్లగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'రంగ్​ దే'. ఈ సినిమా ప్రమోషన్లతో చిత్రబృందం బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించిన ఓ మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. 'చూసి నేర్చుకోకు' అనే బ్యాక్‌గ్రౌండ్‌ పాటతో కొన్ని మేకింగ్‌ సన్నివేశాలను కలిపి ఒక వీడియోగా రూపొందించారు. ఇందులో నితిన్‌, కీర్తిల మధ్య కనిపించిన దృశ్యాలు చాలా ఫన్నీగా ఉన్నాయి.

గతేడాది నితిన్‌ హీరోగా నటించిన 'భీష్మ' సినిమా సూపర్‌ హిట్‌ అయింది. అదే ఉత్సాహంతో ఈ ఏడాది చెక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నితిన్.. అయితే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో రంగ్ దే తో ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు నితిన్. ఈ సినిమా మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. సితార ఎంటర్​టైన్​మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ప్రస్తుతం మూవీ ప్రమోషనల్లో చిత్రయూనిట్‌ బిజీగా ఉంది.

ఈ సినిమాలో సీనియర్‌ నరేష్, కౌసల్య, రోహిణి, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్‌, సత్యం రాజేష్‌, సుహాస్‌ తదితరులు నటిస్తున్నారు. పీసీ శ్రీరామ్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. నవీన్‌ నూలి ఎడిటర్‌ కాగా.. సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీత స్వరాలు సమకూర్చాడు.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story