Nithiin: పెళ్లి తరువాత బతుకు బస్టాండ్ అయిందంటున్న నితిన్ ..!

Venkata Chari
Published on: 27 Feb 2021 1:35 PM IST
‍Nithiin Rang De Movie Bus Standee Song Goes Viral
X

నితిన్ (ఫోటో యూట్యూబ్ )

Nithiin : ఈ మధ్యే వివాహం చేసుకున్న యంగ్ హీరో నితిన్ బతుకు బస్టాండ్ కావాడమేంటని ఆశ్చర్యపోతున్నారా..? నిజమేనండి.. నితిన్ అదే అంటూ పాడుతున్నాడు. నితిన్ హీరోగా వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న 'రంగ్ దే' సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం మార్చి 26న విడుదల కానుంది. హీరోయిన్‌గా కీర్తి సురేష్ నటిస్తున్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఈ మధ్యే సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. రంగ్ దే నుంచి విడుదలైన మొదటి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనికి కోటికి పైగా వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం సినిమా నుంచి బస్టాండే.. బస్టాండే అంటూ సాగే రెండో పాటను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించగా, ఆయన తమ్ముడు సాగర్ ఈ పాటను పాడాడు.

ఈ పాటను శ్రీమణి రాశాడు. నితిన్, కీర్తి సురేష్‌పై వచ్చే ఈ టీజింగ్ సాంగ్ లో హీరో డాన్సులతో పాటు ఇల్లు తుడవడం.. అంట్లు తోమడం లాంటివి కూడా చేసి నవ్వించాడు. రంగ్ దే చిత్రం మార్చి 26న విడుదల అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కూడా పెంచేశారు దర్శక నిర్మాతలు. మిస్టర్ మజ్ను ఫ్లాప్ తర్వాత వెంకీ అట్లూరి చేస్తున్న సినిమా ఇది. మరోవైపు నితిన్ నటించిన చెక్ సినిమాకు ఊహించిన రెస్పాన్స్ రాకపోవడంతో ఈయనకు కూడా రంగ్ దే విజయం కీలకంగా మారింది. ఈ సినిమాకు పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ సమకూరుస్తుండటం విశేషం.


Venkata Chari

Venkata Chari

Next Story