Rang De Movie: అను మిస్సింగ్ అంటూ నితిన్ టీజింగ్ - ఆకట్టుకున్న ట్వీట్

Rang De Movie: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తాజా సినిమా 'రంగ్ దే' మార్చి 26 న థియేటర్లలో విడుదల కానుంది.

Venkata Chari
Published on: 25 March 2021 5:25 PM IST
Nithiins Post For Rang De Movie Promotions Wins Hearts of Netizens
X
రంగ్ దే మూవీలో నితిన్ (ఫొటో ట్విట్టర్)

Rang De Movie: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తాజా సినిమా 'రంగ్ దే' మార్చి 26 న థియేటర్లలో విడుదల కానుంది. ఈ మేరకు హీరోయిన్ కీర్తి సురేష్ ను టీజ్ చేస్తూ.. ఓ ఫన్నీ పోస్ట్ ను ట్విట్టర్ లో అప్ లోడ్ చేశాడు. ఈ పోస్ట్ వైరల్ కావడంతోపాటు రంగ్ దే సినిమాకు ప్రమోషన్స్‌ను కూడా చేస్తుంది. ఏదైమైనా నెటిజన్లను ఆకట్టుకుంటూ ప్రమోషన్ చేస్తున్నాడు హీరో నితిన్.

ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రస్తుతం ప్రమోషనల్ యాక్టివిటీస్ ను ఆపేవారు టీం యూనిట్. ఈ నేపథ్యంలో కీర్తి సురేష్ ను టీజ్ చేస్తూ.. " మిస్సింగ్, కనబడుటలేదు. డియర్ అను, నువ్వు ఎక్కడున్నా రంగ్ దే ప్రమోషన్స్ లో జాయిన్ అవ్వాలని మా కోరిక.. ఇట్లు నీ అర్జున్" అంటూ ట్వీట్ చేశాడు. అయితే ఈ ప్రమోషన్స్ కు మహానటి దూరంగా ఉందని నితిన్, అను (కీర్తి సురేష్) ఆచూకీ కోసం వెదుకున్నట్లు ఆమె చిన్ననాటి ఫొటోతో పాటు ట్వీట్ లో చేశాడు.

ఈ ఫన్నీ పోస్ట్‌పై హైదరాబాద్ పోలీసులు కూడా స్పందించారు. "చింతించకండి నితిన్.. మేము ఈ సమస్యను చూసుకుంటాము" అని రిప్లే ఇచ్చారు. ఈ పోస్ట్ అనేక మంది నెటిజన్ల హృదయాలను హత్తుకుంది. ఇలా ఈ ట్వీట్ ను మర్చి 20న పోస్ట చేశాడు నితిన్. ఈ పోస్ట్ తరువాత కీర్తి సురేష్ ప్రమోషన్స్ లో భాగమైనట్లు తెలుస్తోంది.

రంగ్ దే ప్రోమో ఈవెంట్ లో టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుతం కీర్తి సురేష్.. సర్కారు వారి పాట, అన్నాథే, వాషి, సాని కాయీడం వంటి సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. "రంగ్ దే", "మరక్కర్", "గుడ్ లక్ సఖి", "రెండు జడల సీత" విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

మరోవైపు, వెంకి అట్లూరి దర్శకత్వం వహించిన "రంగ్ దే" విడుదలైన తర్వాత మోర్లపాక గాంధీ డైరెక్షన్ లో నితిన్ ఓ సినిమా చేయనున్నాడు. ఆల్ ది బెస్ట్ టూ 'రంగ్ దే' టీం.


Venkata Chari

Venkata Chari

Next Story