Nithiin Birthday: మాస్ట్రో ఫస్ట్‌లుక్ రిలీజ్, ఆసక్తి రేపుతోన్న పోస్టర్

Nithiin Birthday: నితిన్ కొత్త సినిమా 'మాస్ట్రో ' ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

Kranthi
Updated on: 30 March 2021 12:30 PM IST
‍Nithiin Next Movie Title Maestro First Look Release
X

Nithiin Birthday:(ఫైల్ ఇమేజ్)

Nithiin Birthday: యూత్ స్టార్ నితిన్ పుట్టినరోజు సందర్భంగా బెస్ట్ విషెస్ తెలుపుతూ ఆయన కొత్త సినిమా 'మాస్ట్రో' ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.జయాలు, అపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలను లైన్‌లో పెట్టిన నితిన్ ఇటీవలే 'చెక్' సినిమాతో డిజాస్టర్ మూటగట్టుకొని ఆ వెంటనే 'రంగ్ దే' మూవీతో డీసెంట్ హిట్ అందుకొని ఆకర్షించారు. ఇక ఇప్పుడు 'మాస్ట్రో' అంటూ మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ సొంత బ్యానర్ అయిన శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై ఓ సినిమా చేస్తున్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమానే 'మాస్ట్రో' అంటూ ఫస్ట్‌లుక్ బయటకు వదిలారు. ఇందులో నితిన్ అంధుడిగా కనిపించనుండటం విశేషం. కాగా, తాజాగా విడుదలైన ఈ పోస్టర్‌లో చేతిలో స్టిక్ పట్టుకొని నడుస్తున్న నితిన్ వెనకాలే రక్తపు మరకలు కనిపిస్తుండటంతో చిత్రంలో అతని క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? అనే అనుమానాలు మొదలయ్యాయి.

హిందీ సూపర్ హిట్ మూవీ 'అంధాదున్' రీమేక్ లో నితిన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. యువ దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ సినిమాకు డైరెక్షన్ చేస్తున్నాడు. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో తన సొంత బ్యానర్ అయిన శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై ఎన్.సుధాకర్ రెడ్డి - నికిత రెడ్డిలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మిల్కీ బ్యూటీ తమన్నా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. నితిన్ ఈ సినిమాలో పియానో ప్లేయర్ గా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా జె. యువరాజ్ పనిచేస్తున్న ఈ సినిమా జూన్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Kranthi

Kranthi

Next Story