Nithiin New Movie: వక్కంతం వంశీ డైరెక్షన్ లో నితిన్?

Nithiin New Movie: వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ ను నటించనున్నట్లు టాలీవుడ్ టాక్

Kranthi
Updated on: 3 May 2021 1:42 PM IST
Nithin Upcoming Movie With Vakkantham Vamshi!
X

వక్కంతం వంశీ (ఫైల్ ఇమేజ్)

Nithiin New Movie: హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు లవర్ బాయ్ హీరో నితన్. 'భీష్మ' మూవీ హిట్ తరువాత మరో హిట్ కొట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ అనే సినిమా చేయగా ఆ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. ఆ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా రంగ్ దే కూడా నితిన్ కి అంతగా కలిసి రాలేదు. తొలుత ఓపెనింగ్ కలెక్షన్స్ బాగానే వచ్చినా సరే ఆ తర్వాత నెమ్మదిగా కలెక్షన్స్ తగ్గిపోయాయి. దీంతో ఆయన సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నాడు అని అంటున్నారు.

ప్రస్తుతం మాత్రం ఆయన 'అంధాదున్' రీమేక్ లో చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత పాటల రచయిత చైతన్య కృష్ణ దర్శకత్వంలో 'పవర్ పేట' సినిమాలో ఆయన చేయవలసి ఉంది. కానీ ఇప్పుడు నితిన్ ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. 'చెక్' .. 'రంగ్ దే' అందించిన ఫలితాలే అందుకు కారణమనే టాక్ వినిపిస్తోంది.

మరి 'అంధాదున్' రీమేక్ తరువాత నితిన్ ఏ దర్శకుడితో చేయనున్నాడనే ప్రశ్నకి సమాధానంగా, వక్కంతం వంశీ పేరు వినిపిస్తోంది. వక్కంతం వంశీ ఇటీవల వినిపించిన కథ నచ్చడంతో, ముందుగా ఆయన ప్రాజెక్టును పట్టాలెక్కించాలనే నిర్ణయానికి నితిన్ వచ్చాడని అంటున్నారు. రచయితగా వక్కంతం వంశీకి మంచి పేరు ఉంది. ఆయన కథలను అందించిన సినిమాలు కొన్ని ఘన విజయాలను అందుకున్నాయి. పూర్తి వివరాలను మూవీ టీం అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.

Kranthi

Kranthi

Next Story