Nithin Maestro Update: ఓటీటీలో నితిన్ మాస్ట్రో

Nithin Maestro Update: నితిన్ మాస్ట్రో మూవీ హాట్ స్టార్ సంస్థ రూ.32 కోట్లుకు కొన్నట్లు టాలీవుడ్ టాక్.

Kranthi
Updated on: 26 Jun 2021 9:13 AM IST
Nithin Nabha Natesh Maestro Gets Good Offer From Hotstar
X

Nithin Nabha Natesh Maestro

Nithin Maestro Update: రంగ్ దే తో కాస్త రిలాక్స్ అయిన నితిన్ మాస్ట్రో సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. అంధాధూన్ రీమేక్ కావడంతో.. థియేటర్స్ మీదే డిపెండ్ కావడం కరెక్ట్ కాదనుకుంటున్నాడు. అందుకే ఓటీటీ కి గ్రీన్ సగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. హాట్ స్టార్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.

హిందీ మూవీ 'అంధాధూన్' సినిమాకు తెలుగు రీమేక్‌‌గా వస్తోంది మాస్ట్రో. మేర్లపాక గాంధీ దర్శకత్వం వస్తోన్న ఈ మూవీలో హీరో నితిన్ నటిస్తోన్న విషయం తెలిసిందే.. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కూడ ప్రేక్షకుల్నిబాగా ఆకట్టుకుంది. ఇక ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పార్ట్ ను ముగించుకుంది. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తాజాగా ఈ సినిమా హాట్ స్టార్ సంస్థ రూ.32 కోట్లుకు కొన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మేకింగ్ కి రూ.29 కోట్ల వరకు ఖర్చయిందట. ఈ సినిమా ఆగస్టులో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. స్ట్రీమింగ్ డేట్ గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సిఉంది. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా దక్కించుకుంది. మాస్ట్రోను నితిన్ సొంత బ్యానర్‌ శ్రేష్ట్ మూవీస్‌పై ఎన్‌. సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డిలు నిర్మించారు.

ఈ సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్ నితిన్‌కు జోడిగా నటిస్తోంది. మరోకీలక పాత్రలో తమన్నా కనిపించనుంది. ఈ సినిమాను జూన్ 11న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు నిర్మాత‌లు తెలియ‌జేశారు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా విడుదల కూడా వాయిదా పడింది.

Kranthi

Kranthi

Next Story