NITHIIN30: ఇంట్రెస్టింగ్ గా 'నితిన్ 30' ఫ్రీ లుక్ : రేపు టైటిల్ అనౌన్స్

Nithiin 30 Free Look Released
x

నితిన్ ౩౦ వ సినిమా  ఫ్రీ లుక్

Highlights

NITHIIN30: హీరో నితిన్ 'రంగ్ దే' విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. రేపు తన 30వ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నాడు.

NITHIIN30: యూత్ స్టార్ నితిన్ 'రంగ్ దే' విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. అయితే రేపు తన 30వ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నాడు. ఈమేరకు ఈ రోజు ప్రీలుక్ ని రిలీజ్ చేసి, విషయాన్ని వెల్లడించారు టీమ్. నితిన్ ప్రీ లుక్ ఆకట్టుకుంటుంది. పియానో ప్లే చేస్తున్న నితిన్ బ్యాక్ సైడ్ లుక్ కనిపిస్తుండగా.. పక్కనే ఓ పిల్లి పాలు తాగుతూ కనిపిస్తోంది.

హిందీ సూపర్ హిట్ మూవీ 'అంధాదున్' రీమేక్ లో నితిన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. యువ దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ సినిమాకు డైరెక్షన్ చేస్తున్నాడు. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో తన సొంత బ్యానర్ అయిన శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై ఎన్.సుధాకర్ రెడ్డి - నికిత రెడ్డిలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మిల్కీ బ్యూటీ తమన్నా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. నితిన్ ఈ సినిమాలో పియానో ప్లేయర్ గా కనిపించనున్నాడు.

'#NITHIN30' టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ని మార్చి 3012 గంటలకు విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా జె. యువరాజ్ పనిచేస్తున్న ఈ సినిమా జూన్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories