రానా వెంకీ సిరీస్ తో రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్ సోదరి

Nisha Aggarwal: రానా దగ్గుబాటి మరియు వెంకటేష్ దగ్గుబాటి కలిసి ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.

admin1
Published on: 17 Aug 2021 6:54 PM IST
Nisha Aggarwal is all set to Make her Comeback with Rana-Venkatesh Web Series
X

రానా వెంకీ సిరీస్ తో రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్ సోదరి

Nisha Aggarwal: రానా దగ్గుబాటి మరియు వెంకటేష్ దగ్గుబాటి కలిసి ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో విడుదల కాబోతోంది అనే విషయం నెట్టింట్లో వైరల్ గా మారింది. కంటెంట్ బావుంటే వెబ్ సిరీస్ లో సైతం నటించడానికి సిద్ధం అని ఇద్దరు హీరోలు ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పారు. ఈ నేపథ్యంలోనే కథ బాగా నచ్చడంతో వెంకీ మరియు రానా ఈ వెబ్ సిరీస్ చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

ఈ వెబ్ సిరీస్ లో స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్ సోదరి నిషా అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. "ఏమైంది ఈ వేళ" అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నిషా అగర్వాల్ ఈ వెబ్ సిరీస్ లో కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. "సోలో", "సుకుమారుడు", "సరదాగా అమ్మాయితో" వంటి సినిమాలలో కనిపించింది నిషా. అయితే 2013లో పెళ్లి చేసుకుని సెటిల్ అయిన నిషా సినిమాలకి పూర్తిగా గుడ్ బై చెప్పేసింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఆమె మళ్లీ కెమెరా ముందుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రానా వెంకీ వెబ్ సిరీస్ లో నిషా అగర్వాల్ ఒక ముఖ్య పాత్ర పోషించేందుకు రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

admin1

admin1

Next Story