Singer Sunitha: మ్యూజికల్ లవ్ స్టోరీ ‘నిలవే’.. ‘సఖి’, ‘ఏ మాయ చేశావే’ లాంటి ఫీల్ గుడ్ మూవీ!

Nilave Pre-Release Event: సరికొత్త భావోద్వేగాలతో కూడిన మ్యూజికల్ లవ్ స్టోరీ ‘నిలవే’ విడుదలకు సిద్ధమైంది.

Arun Chilukuri
Published on: 11 Feb 2026 7:11 PM IST
Singer Sunitha: మ్యూజికల్ లవ్ స్టోరీ ‘నిలవే’.. ‘సఖి’, ‘ఏ మాయ చేశావే’ లాంటి ఫీల్ గుడ్ మూవీ!
X

Nilave Pre-Release Event: సరికొత్త భావోద్వేగాలతో కూడిన మ్యూజికల్ లవ్ స్టోరీ ‘నిలవే’ విడుదలకు సిద్ధమైంది. సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన ఈ చిత్రం, ఫిబ్రవరి 13న ప్రేమికుల రోజు కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా బుధవారం మాదాపూర్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ వేడుకకు ప్రముఖ గాయని సునీత ముఖ్య అతిథిగా విచ్చేశారు.

సింగర్ సునీత ఈ వేడుకలో మాట్లాడుతూ.. "ఈ మధ్య కాలంలో అరుదుగా కనిపించే చక్కటి భావోద్వేగాల సమాహారం ఈ సినిమా. 'సఖి', 'ఏ మాయ చేశావే' వంటి క్లాసిక్ సినిమాల తరహాలో 'నిలవే' ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తుంది. కీరవాణి గారు కూడా ఈ చిత్రంలోని పాటలను మెచ్చుకొని సపోర్ట్ చేయడం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. ప్రతి ఫ్రేమ్ చాలా అందంగా ఉంది," అని కొనియాడారు.

హీరో సౌమిత్ పోలాడి మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి గారి స్ఫూర్తితో నటుడిగా మారానని, తన తండ్రి సపోర్ట్‌తో ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు. "లవ్ స్టోరీస్ విభాగంలో ఈ సినిమా ఒక కేజీఎఫ్ లాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇప్పటికే వేసిన ప్రీమియర్ షోలకు అద్భుతమైన స్పందన వచ్చింది," అని ధీమా వ్యక్తం చేశారు.

దర్శకుడు సాయి కే వెన్నం మాట్లాడుతూ.. సందీప్ రెడ్డి వంగా ఇచ్చిన స్ఫూర్తితో, కంటెంట్‌ను నమ్మి ఈ సినిమా తీశామని చెప్పారు. మంచి సినిమాను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ఆకాంక్షించారు. హీరోయిన్ శ్రేయాసి సేన్ మాట్లాడుతూ, తెలుగు ఇండస్ట్రీలో లాంచ్ అవ్వడం గర్వంగా ఉందని, మ్యూజిక్ ఈ సినిమాకు ప్రాణమని పేర్కొన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ నాయక్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో కథతో పాటే సాగే 11 పాటలు ఉంటాయని, సంగీత ప్రియులకు ఇది ఒక విందులా ఉంటుందని తెలిపారు. నిర్మాతలు రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి మాట్లాడుతూ.. చిత్ర బృందం పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హర్ష చెముడు, సుప్రియా ఐసోలాతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story