వాయిదా సెంటిమెంట్ వర్క్ ఔట్ అవుతుందని అంటున్న హీరో

వాయిదా సెంటిమెంట్ వర్క్ ఔట్ అవుతుందని అంటున్న హీరో
x
Highlights

యువహీరో నిఖిల్ నటించిన 'అర్జున్ సురవరం' సినిమాకి మొదట 'ముద్ర' అనే టైటిల్ నిర్ణయించారు కానీ ఆ టైటిల్ ని వేరొక ప్రొడక్షన్ కంపెనీ రిజిస్టర్ చేయడంతో...

యువహీరో నిఖిల్ నటించిన 'అర్జున్ సురవరం' సినిమాకి మొదట 'ముద్ర' అనే టైటిల్ నిర్ణయించారు కానీ ఆ టైటిల్ ని వేరొక ప్రొడక్షన్ కంపెనీ రిజిస్టర్ చేయడంతో టైటిల్ 'అర్జున్ సురవరం' గా మార్చాల్సి వచ్చింది. ఆ క్రమంలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమయ్యాయి. మార్చి 29న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఏకంగా మే 1కి వాయిదా వేస్తున్నామని చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ, "నా సినిమాల్లో వాయిదా పడిన సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి. 'కార్తికేయ', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' దానికి ఉదాహరణ." అని చెప్పుకొచ్చాడు.

"ఈసారీ అలానే జరుగుతోంది. 'అర్జున్ సురవరం' కూడా సూపర్ హిట్ అవుతుంది" అని నమ్మకం వ్యక్తపరిచాడు. సినిమాలో తన పాత్ర గురించి మాట్లాడుతూ, "ఈ సినిమాలో సిన్సియర్ జర్నలిస్టు పాత్రలో కనిపిస్తాను. అలాంటి పాత్రలో నటించడం సాహసం అనే చెప్పాలి. ఇందులో మీడియా గురించి పాజిటివ్ విషయాలు, నెగెటివ్ విషయాల్ని చర్చించాము" అని తెలిపారు. ఈ చిత్రం తమిళ హిట్ సినిమా 'కనితన్' కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. టి.ఎన్.సంతోష్ ఈ సినిమా కి దర్శకత్వం వహించారు. ఠాగూర్ మధు సమర్పణలో ఆరా సినిమాస్, మూవీ డైనమిక్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories