Tittle: హిస్టారికల్ జానర్ లో నిఖిల్ స్వయంభు.. ఫస్ట్ లుక్ అదుర్స్..

Tittle: హిస్టారికల్ జానర్ లో నిఖిల్ స్వయంభు.. ఫస్ట్ లుక్ అదుర్స్..
x

Nikhil: హిస్టారికల్ జానర్ లో నిఖిల్ స్వయంభు. ఫస్ట్ లుక్ అదుర్స్

Highlights

తన బర్త్ డే సందర్భంగా ఓ క్రేజీ అనౌన్స్ మెంట్ ఇస్తానని ప్రకటించిన నిఖిల్..చెప్పిన విధంగానే సర్ ప్రైజ్ చేశాడు. నిఖిల్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో యుద్ధ భూమిలో పోరాడుతున్న యోధుడిలా నిఖిల్ దర్శనం ఇచ్చాడు.

Nikhil: స్టార్ హీరోలు సైతం షాక్ అయ్యేలా యంగ్ హీరో నిఖిల్ వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెట్టుకుంటున్నాడు. కార్తికేయ2 తో హిందీ ఆడియెన్స్ ని మెప్పించిన ఈ కుర్ర హీరో ప్రస్తుతం స్పై టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకుడిగా పరిచయం అవుతూ స్పై మూవీని తెరకెక్కిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ కథాంశంతో స్పై చిత్రం రూపొందుతుండగా ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ గ్లింప్స్, టీజర్ సినిమాపై ఎక్కడ లేని అంచనాలు క్రియేట్ చేసింది.

స్పై మూవీ జూన్ 29న విడుదల కానుండగా గ్లోబల్ హీరో రాంచరణ్ నిర్మాణ సారథ్యంలో ది ఇండియా హౌస్ టైటిల్ తో మరో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్ 140వ జయంతి సందర్భంగా ఆయన జీవితంపై ది ఇండియా హౌస్ ను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, తన బర్త్ డే సందర్భంగా ఓ క్రేజీ అనౌన్స్ మెంట్ ఇస్తానని ప్రకటించిన నిఖిల్..చెప్పిన విధంగానే సర్ ప్రైజ్ చేశాడు. నిఖిల్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో యుద్ధ భూమిలో పోరాడుతున్న యోధుడిలా నిఖిల్ దర్శనం ఇచ్చాడు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు స్వయంభూ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. పోస్టర్ చూస్తుంటే ఇదొక సోషియో ఫాంటసీ మూవీగా అర్థం అవుతోంది.

స్వయంభు ఫస్ట్ లుక్ పోస్టర్ లో సరికొత్త గెటప్ లో కనిపించిన నిఖిల్ తన సినిమాపై అంచనాలు పెంచేసుకున్నాడు. స్వయంభు చిత్రం నిఖిల్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ఆగస్ట్ నుంచి ప్రారంభం కానుంది. మొత్తంగా కార్తికేయ2 కి ముందు కార్తికేయ2 కి తర్వాత అన్నట్లుగా నిఖిల్ కెరీర్ మారిపోయింది. కార్తికేయ2తో నార్త్ బాక్సాఫీసుల్ని సైతం షేక్ చేయడంతో నిఖిల్ తో భారీ ప్రాజెక్టులు చేసేందుకు దర్శకనిర్మాతలు పోటీపడుతున్నారు. కెరీర్ పరంగా పీక్ స్టేజ్ లో ఉన్న నిఖిల్ కు బర్త్ డే విషెస్ తో పాటు ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం.

Show Full Article
Print Article
Next Story
More Stories