Nikhil SPY: నేతాజీ చనిపోయారా.. చంపేశారా.. నిఖిల్ స్పై రహస్యాన్ని విప్పుతుందా..?

Nikhil SPY: ఈ మూవీ టీజర్ ను మే 15న ఢిల్లీలోని కర్తవ్య పథ్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేసుకున్నారు.

Jyothi
Updated on: 13 May 2023 8:30 PM IST
Nikhil Siddhartha Spy Teaser Releasing At Kartavya Path In Delhi
X

Nikhil SPY: నేతాజీ చనిపోయారా..చంపేశారా..నిఖిల్ స్పై రహస్యాన్ని విప్పుతుందా

Nikhil SPY: సుభాష్ చంద్రబోస్.. భారతదేశం గర్వించదగ్గ స్వాతంత్ర్య సమరయోధుడు..మీరు నాకు రక్తం ఇస్తే...నేను మీకు స్వేచ్ఛను ఇస్తాను అనే నినాదంతో భారత స్వాతంత్ర పోరాటంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించుకున్నారు. అయితే ఆయన అదృశ్యం ఇప్పటికీ ఒక మిస్టరీనే..సుభాష్ చంద్రబోస్ నిజంగానే ప్లేన్ క్రాష్ లో చనిపోయారా లేక మరేదైనా జరిగిందా అనేది ఇంతవరకు అంతుచిక్కలేదు. నేతాజీ మరణంపై భారత ప్రభుత్వం పలు కమీషన్లు వేసినా మిస్టరీ మాత్రం అలానే ఉంది.

నేతాజీ ఏమయ్యారో తెలుసుకోవాలని ప్రతి భారతీయుడికి ఉంది. ఈ నేపథ్యంలోనే సుభాష్ చంద్రబోస్ పై పలు సినిమాలు రాగా మన టాలీవుడ్ నుంచి కూడా నేతాజీ డెత్ మిస్టరీని బేస్ చేసుకొని ఒక సినిమా రెడీ అయింది. అదే స్పై..కార్తికేయ2 తో పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ సాధించిన మన యువ హీరో నిఖిల్ టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమాని జూన్ 29న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఎడిటర్ గ్యారీ బిహచ్ దర్శకత్వంలో కే. రాజశేఖర్ రెడ్డి స్పై చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ టీజర్ ను మే 15న ఢిల్లీలోని కర్తవ్య పథ్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేసుకున్నారు.

సుభాష్ చంద్రబోస్ రహస్యాల ఆధారంగా స్పై చిత్రాన్ని తెరకెక్కించడంతో ఆయన విగ్రహం దగ్గర టీజర్ ను విడుదల చేయడం సముచితంగా మేకర్స్ భావించారు. అందుకే కర్తవ్య పథ్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీలో నిఖిల్ స్పై ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. నేతాజీ విమాన ప్రమాదం తర్వాత తప్పించుకున్నారని...ఆ తర్వాత రహస్య జీవితం గడిపారని చాలా మంది నమ్ముతున్నారు. మరి, ఈ మూవీలో నేతాజీ డెత్ మిస్టరీ పై స్పై టీమ్ ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.

Jyothi

Jyothi

Next Story