Nikhil Siddhartha: పాన్ ఇండియా లెవల్లో హ్యాట్రిక్ కి సిద్దమైన నిఖిల్

Nikhil Siddhartha: యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ్ కార్తికేయ2 వచ్చే వరకు అసలు తన మూవీలు వస్తాయా రావా అనే పరిస్థితి ఉండేది.

Arun Chilukuri
Updated on: 28 Jun 2023 8:15 PM IST
Nikhil Siddhartha Slated for Hatrick at Pan Indian Level
X

Nikhil Siddhartha: పాన్ ఇండియా లెవల్లో హ్యాట్రిక్ కి సిద్దమైన నిఖిల్

Nikhil Siddhartha: యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ్ కార్తికేయ2 వచ్చే వరకు అసలు తన మూవీలు వస్తాయా రావా అనే పరిస్థితి ఉండేది. కాని కార్తికేయ 2 హిట్ తర్వాత పాన్ ఇండియా స్టారైపోయాడు. ఏకంగా తన మూవీ కోసం సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా జనం వేయిట్ చేసేంతగా సీన్ మారింది. మరి అన్నీ మంచి శకునాల మధ్య నిఖిల్ హ్యాట్రిక్ కిక్ ఇస్తాడా?

నిఖిల్ ఏం చేసినా ఇప్పుడు కలిసొస్తోంది. రెండు హిట్ల తర్వాత స్పైతో హ్యాట్రిక్ కన్ఫామ్ అనే పరిస్థితి వచ్చింది. ఇండియా హౌజ్, స్పై మూవీలకు వచ్చిన హైప్ తో నిఖిల్ ఫేట్ మారేలా ఉందంటున్నారు. కాని కథలో చిన్న ట్విస్ట్ ఉండటంతో నిఖిల్ లో కంగారుపెట్టిస్తున్నాయి. కార్తికేయ హిట్టైనా కాని దాని సీక్వెల్ కార్తికేయ టూ రిలీజ్ కి ఫిల్మ్ టీం చాలా కష్టపడాల్సి వచ్చింది. సినిమా ఆడుతుందా లేదా అనుకునేంతగా ఫిల్మ్ టీం డిసప్పాయింట్ అయ్యింది. కాని కార్తికేయ 2 పాన్ ఇండియా హిట్ అయ్యి నిఖిల్ ఫేట్ మార్చేసింది.

ఇలా నిఖిల్ కి కార్తికేయ 2 హిట్ మాత్రమే కాదు తన తల రాత మార్చేలా చేసింది.. అలాగే 18 పేజెస్ కూడా తన ఫేట్ మార్చింది. మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. దీంతో అంతా నిఖిల్ అద్రుష్టమే అన్నారు. ఒకవైపు కార్తికేయ 2, మరో వైపు 18 పేజెస్ రెండు హిట్ అవ్వడం , మరో వైపు, స్పై టీజర్ కి భారీ రెస్పాన్స్ రావడం, ఆవెంటనే ఇండియా హౌజ్ మూవీ మీద దేశ వ్యాప్తంగా చర్చ జరగటం, ఇవన్నీ నిఖిల్ పేరుని దేశవ్యాప్తంగా ఫోకస్ చేశాయి. దీంతో స్పై మీద అంచనాల భారం పెరిగేలా చేసాయి.

స్పై మూవీ కాన్సెప్ట్ అంతా సుభాష్ చంద్రభోస్ లైఫ్ సీక్రెట్స్ మీదే తెరకెక్కింది కాబట్టి, కామన్ గా పాన్ ఇండియా అటెన్షన్ ఉంటుంది. ఏమాత్రం కథ, కథనం మేకింగ్ కలిసొచ్చినా, కార్తికేయ 2 కంటే భారీ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టే హ్యాట్రిక్ కిక్ తో మరోసారి నిఖిల్ పాన్ ఇండియా మార్కెట్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడంటున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story