Nikhil Siddharth: నాలుగు సినిమాలకు సైన్‌ చేశాను.. ఇప్పుడేమో ఇలా అయ్యింది..

Nikhil: ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి పేరు తెచ్చుకున్న హీరోలలో నిఖిల్ సిద్ధార్థ్ కూడా ఒకరు.

admin1
Updated on: 27 Jan 2022 7:31 PM IST
Nikhil says Corona is ruining his career
X

కరోనా కెరీర్స్ ను దెబ్బ తీస్తోంది అంటున్న నిఖిల్

Nikhil: ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి పేరు తెచ్చుకున్న హీరోలలో నిఖిల్ సిద్ధార్థ్ కూడా ఒకరు. సినిమా ఎలా ఉన్నా కథ సెలక్షన్లో మాత్రం ఎప్పుడు నిఖిల్ నిరాశపరచడని అభిమానులు నమ్మకం. అయితే ఎప్పుడో 2019లో తమిళ్ సినిమా "కనితన్" కి రీమేక్ గా వచ్చిన "అర్జున్ సురవరం" సినిమా తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించలేదు. కరోనా మొదలయ్యాక నిఖిల్ సినిమాలేవీ విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో అసలు నిఖిల్ ఏమైపోయాడు అని అభిమానులు అనుకుంటుంటే, నిఖిల్ ఒక్క ట్వీట్ తో అన్ని డౌట్ లకి క్లారిటీ ఇచ్చారు.

"కరోనా అందరి కెరీర్స్ ను ఎలా దెబ్బతీస్తోంది చూస్తుంటే చాలా బాధగా ఉంది. అర్జున్ సురవరం సినిమా హిట్ అయ్యాక నేను నాలుగు సినిమాలు సైన్ చేశాను. నాలుగు అద్భుతమైన స్క్రిప్ట్ లు వాటి మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. కానీ కరోనా కారణంగా సినిమాల విడుదల ఆలస్యం అవుతూ వస్తోంది. త్వరగా పరిస్థితులు చక్కబడి సినిమాలు విడుదల అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు నిఖిల్. నిఖిల్ హీరోగా "కార్తికేయ 2" సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. "18 పేజెస్" సినిమాలో కూడా హీరోగా నటిస్తున్న నిఖిల్ ఈ సినిమా తర్వాత మరొక రెండు సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


admin1

admin1

Next Story