Allu Sirish - Nikhil: ముస్తఫా పాట పాడుకుంటున్న నిఖిల్..అల్లు శిరీష్

Allu Sirish - Nikhil: నిఖిల్ తన పెళ్లికి సంబంధించిన సీక్రెట్ ను మొదట అల్లు శిరీష్ తో పంచుకున్నానని తెలిపాడు. అదేంటో తెలుసా?

Kranthi
Published on: 9 Jun 2021 8:58 AM IST
Nikhil Siddharth Shared his Personal Details With his Close Friend Allu Sirish
X

Allu Sirish - Nikhil:(File Image) 

Allu Sirish - Nikhil: యంగ్ జనరేషన్ హీరోస్ వచ్చాక టాలీవుడ్ లో ఫ్రెండ్ షిప్పులు పెరిగిపోయాయి. రామ్ చరణ్, అల్లు అర్జున్, రాణా, శర్వానంద్, నాగచైతన్య ఇలాంటి బ్యాచ్ మొన్నటివరకు హీరోస్ గ్రూప్ లా ఉండేది. ఇప్పుడు మరో తరం వచ్చేసింది. వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్, నిఖిల్ లాంటివాళ్లు మరో జనరేషన్ ఫ్రెండ్స్ గా కనపడుతున్నారు. ఈ మధ్య నిఖిల్ పుట్టినరోజుకు అల్లు శిరీష్ చేసిన ట్వీట్ చూస్తే.. వారిద్దరి ఫ్రెండ్ షిప్ డీప్ గానే ఉందని అర్ధమవుతోంది. అందరికీ నిఖిల్ పెళ్లయ్యేవరకు, వధువు ఎవరో తెలియదు.

అంత సీక్రెట్ మెయిన్ టెయిన్ చేశాడు నిఖిల్. అయితే ఇప్పుడు ట్వీట్ లో అల్లు శిరీష్ నిఖిల్, అతని భార్య పెళ్లికి ముందే డేటింగ్ లో ఉన్న సమయంలో ఫస్ట్ డేట్ సంగతి తెలిసిన మూడో వ్యక్తిని తానేనని బయటపెట్టాడు. పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు.. నిఖిల్ అప్ కమింగ్ మూవీ 18 పేజెస్ కి కూడా ఆల్ ద బెస్ట్ చెప్పాడు అల్లు శిరీష్. నిఖిల్ కూడా తన సినిమా ఫస్ట్ లుక్ నీకు నచ్చే ఉంటుంది.. థ్యాంక్యూ అంటూ ట్వీట్ చేశాడు శిరీష్ కు.

అసలు ఈ సినిమా పట్టాలెక్కడం వెనక అల్లు శిరీష్ కృషి కూడా ఉందంట. అంతేకాదు .. గతంలో కూడా చాలాసార్లు అల్లు శిరీష్ నిఖిల్ కు ఫేవర్ చేసినట్లు తెలుస్తోంది. అలా వీరిద్దరి ఫ్రెండ్ షిప్ హెల్దీ వాతావరణంలో ముందుకు పోతూ ఉంది.


Kranthi

Kranthi

Next Story