Nikhil Siddharth: 116 రూపాయలతో కరియర్ మొదలు పెట్టి ఇప్పుడు 100 కోట్ల క్లబ్ లోకి దూసుకెళ్లిన నిఖిల్

Nikhil Siddharth: 116 రూపాయలతో కరియర్ మొదలు పెట్టి ఇప్పుడు 100 కోట్ల క్లబ్ లోకి దూసుకెళ్లిన నిఖిల్

Arun Chilukuri
Published on: 27 Aug 2022 4:49 PM IST
Nikhil Siddharth Reaches Rs 100 Crore Club Starting with Rs 116
X

Nikhil Siddharth: 116 రూపాయలతో కరియర్ మొదలు పెట్టి ఇప్పుడు 100 కోట్ల క్లబ్ లోకి దూసుకెళ్లిన నిఖిల్

Nikhil Siddharth: ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తమకంటూ ఒక మంచి గుర్తింపుని సంపాదించుకోవడం మాత్రమే కాక ఆ స్టార్ డం ని కొనసాగించగలిగే సత్తా కేవలం కొంతమందిలో మాత్రమే ఉంటుంది. ఎటువంటి గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు సూపర్ స్టార్లుగా మారిన చిరంజీవి, రజనీకాంత్ వంటి స్టార్లు చాలామంది ఉన్నారు. తాజాగా ఒక యువ హీరో కూడా ఇప్పుడు అదే రేంజ్ లో తన ప్రతిభను చాటుతున్నాడు. అతను మరెవరో కాదు నిఖిల్ సిద్ధార్థ్.

నితిన్ హీరోగా నటించిన "సంబరం" అనే సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన నిఖిల్ అందుకున్న మొదటి రెమ్యూనరేషన్ అక్షరాల 116 రూపాయలు. ఆ తరువాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన నిఖిల్ "హ్యాపీడేస్" సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత నిఖిల్ హీరోగా నటించిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి కానీ ప్రతి ఫ్లాప్ సినిమా నుంచి ఎంతో నేర్చుకున్నా నిఖిల్ ఆ తర్వాత తన స్క్రిప్ట్ సెలక్షన్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు.

"స్వామి రారా", "సూర్య వర్సెస్ సూర్య", "కార్తికేయ" వంటి సూపర్ హిట్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక ఫాన్ ఫాలోయింగ్ ను ఏర్పరచుకున్న నిఖిల్ తాజాగా ఇప్పుడు "కార్తికేయ 2" సినిమాతో 100 కోట్ల క్లబ్లో కూడా చేరిపోయి అభిమానులకి సర్ప్రైజ్ ఇచ్చారు. చందు మొండేటి దర్శకత్వంలో 2014లో విడుదలైన సూపర్ హిట్ సినిమా "కార్తికేయ" కి సీక్వెల్ గా తెరకెక్కిన "కార్తికేయ 2" ఇప్పుడు అమెరికాలో 1.4 మిలియన్ డాలర్లను క్రాస్ చేసి 100కు పైగా థియేటర్లలో ప్రదర్శింపబడుతూ రికార్డులు సృష్టిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా డ్రీమ్ రన్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కృషి, పట్టుదల ఉంటే అసాధ్యాలను సైతం సుసాధ్యం చేయగలం అని నిరూపించిన వారిలో ఇప్పుడు నిఖిల్ కూడా ఒకరుగా చెప్పుకోవచ్చు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story