Nikhil Siddhartha: నాని డైరెక్టర్ కి కండిషన్ పెట్టిన నిఖిల్..

* నాని డైరెక్టర్ కి కండిషన్ పెట్టిన నిఖిల్

Dhatripriya
Updated on: 2 March 2023 9:00 AM IST
Nikhil Says He Will Do A Film With Nani Director
X

 నాని డైరెక్టర్ తో అప్పుడే సినిమా చేస్తాను అంటున్న నిఖిల్

Nikhil Siddhartha: "కార్తికేయ 2" సినిమాతో ప్యాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ అందుకున్న యువ హీరో నిఖిల్ ఈమధ్యనే "18 పేజెస్" సినిమాతో పర్వాలేదు అనిపించారు. త్వరలోనే "స్పై" అనే మరొక ఆసక్తికరమైన థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదల కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల దర్శక నిర్మాతలు ఈ సినిమాని వాయిదా వేశారు.

తాజాగా ఇప్పుడు నిఖిల్ మరొక డైరెక్టర్ తో తన సినిమాని లైన్ లో పెట్టారు. ఈసారి నిఖిల్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సినిమా సైన్ చేశారు. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, వంటి మంచి సినిమాలకు దర్శకత్వం వహించిన వివేక్ ఆత్రేయ ఈ మధ్యనే నాని హీరోగా "అంటే సుందరానికి" సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. కానీ ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేక పోయింది. తాజాగా ఇప్పుడు వివేక్ ఆత్రేయ నిఖిల్ కి ఒక విభిన్నమైన లవ్ స్టోరీ నెరేట్ చేశారట.

నిఖిల్ కి కూడా కథ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చేసేసారని తెలుస్తోంది. సినిమాలో ఫస్ట్ అఫ్ అదిరిపోయేలాగా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సినిమా సెకండ్ హాఫ్ లో కొన్ని బోరింగ్ సన్నివేశాలు మరియు రొటీన్ కథ ఉన్నాయని నిఖిల్ కి అనిపించిందట. అందుకే సెకండ్ హాఫ్ లో కొన్ని చిన్న చిన్న మార్పులు చేయమని నిఖిల్ వివేక్ ఆత్రేయ ను కోరారు. దీనికోసం ఆరు నెలల సమయం కూడా ఇచ్చారు. ఈ గ్యాప్ లో వివేక్ ఆత్రేయ నిఖిల్ ను మెప్పించగలిగితే వీరిద్దరి కాంబినేషన్లో ఖచ్చితంగా సినిమా వస్తుందని చెప్పవచ్చు.

Dhatripriya

Dhatripriya

Next Story