Nikhil Siddhartha: ఇదివరకు ఎప్పుడూ చేయనటువంటి జోనర్ లో నిఖిల్ సినిమా

Nikhil Siddhartha: ఇదివరకు ఎప్పుడూ చేయనటువంటి జోనర్ లో నిఖిల్ సినిమా

Dhatripriya
Updated on: 17 March 2023 8:31 PM IST
Nikhil Is Coming With Periodical Movie Before The Audience
X

Nikhil Siddhartha: పీరియాడిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నిఖిల్

Nikhil Siddhartha: ఈ మధ్యనే చందు మొండేటి దర్శకత్వంలో "కార్తికేయ 2" సినిమాతో అతిపెద్ద బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు నిఖిల్ సిద్ధార్థ. ఈ ఒక్క సినిమాతో ఈ యువ హీరోకి ప్యాన్ ఇండియా రేంజ్ లో మంచి మార్కెట్ వచ్చేసింది. అయితే ఈ మధ్యనే నిఖిల్ హీరోగా నటించిన "18 పేజెస్" అనుకున్న స్థాయిలో మంచి విజయాన్ని సాధించలేకపోయింది. తాజాగా ఇప్పుడు నిఖిల్ "స్పై" అనే ఒక మరొక ఆసక్తికరమైన థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు.

ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ తనదైన శైలిలో మంచి కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటూ కరియర్లో ముందుకు దూసుకు వెళ్తున్నాడు నిఖిల్. నిఖిల్ సినిమా అనగానే సినిమాలో ఏదో ఒక కొత్తదనం కచ్చితంగా ఉంటుంది అని అభిమానులు నమ్మే స్థాయికి ఎదిగాడు నిఖిల్. ఈ నేపథ్యంలోనే నిఖిల్ ఇప్పుడు మరొక ఆసక్తికరమైన సినిమాతో త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. టాగోర్ మధు నిర్మాణంలో ఒక సినిమా చేయబోతున్నారు నిఖిల్.

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. ఇది ఒక పీరియాడిక్ సినిమా అని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమా పునర్జన్మల కాన్సెప్ట్ తో నడుస్తుందట. ఇదివరకు ఎప్పుడూ నిఖిల్ ఇలాంటి ఒక జోనర్ లో నటించలేదు. దీంతో ఈ సినిమాపై కూడా ప్రేక్షకులకు మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇంకా ఈ సినిమా డైరెక్టర్ ఎవరు అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాతో ఒక కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.

Dhatripriya

Dhatripriya

Next Story