logo

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పాత్రలో యువహీరో

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పాత్రలో యువహీరో
Highlights

ఈ మధ్యనే కన్నడలో సూపర్ హిట్ అయిన 'కిరిక్ పార్టీ' తెలుగు రీమేక్ అయిన 'కిరాక్ పార్టీ' లో కనిపించిన నిఖిల్...

ఈ మధ్యనే కన్నడలో సూపర్ హిట్ అయిన 'కిరిక్ పార్టీ' తెలుగు రీమేక్ అయిన 'కిరాక్ పార్టీ' లో కనిపించిన నిఖిల్ ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయినా సంగతి తెలిసిందే. ప్రస్తుతం తమిళ చిత్రం 'కణితన్' ను తెలుగులో 'అర్జున్ సురవరం' అనే టైటిల్ తో రీమేక్ చేస్తూ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో నిఖిల్ మొట్టమొదటి సారిగా ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా పూర్తయిన తర్వాత ఇప్పటికే తన తదుపరి చిత్రాన్ని కిషన్ కట్ట అనే ఒక కొత్త దర్శకుడి తో చేయనున్నట్లు తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు బయటకు వచ్చాయి.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నితిన్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత్రలో కనిపించనున్నాడట. రెండు నెలల క్రితం అనౌన్స్ చేసిన ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. 'జై లవకుశ' సినిమా తర్వాత కొన్నాళ్లు గ్యాప్ తీసుకొని మళ్లీ '118' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన నివేద థామస్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. నిఖిల్ సరసన హీరోయిన్ గా నటించటం నివేదాథామస్ కు ఇది మొదటిసారి. హరినికేశ్ రెడ్డి, ఉప్పలపాటి ఈ సినిమాను సంయుక్తంగా రెడ్ స్కై ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.

లైవ్ టీవి

Share it
Top