Nikhil Siddharth: నిర్మాతలను ఇరకాటంలో పడేసిన నిఖిల్

Nikhil Siddharth: నిర్మాతలను ఇరకాటంలో పడేసిన నిఖిల్

Rama Rao
Updated on: 13 July 2022 8:30 PM IST
Nikhil Announced The Release Date Before the Producers | Tollywood
X

Nikhil Siddharth: నిర్మాతలను ఇరకాటంలో పడేసిన నిఖిల్

Nikhil Siddharth: యువ హీరో నిఖిల్ చాలా కాలం తర్వాత మళ్లీ "కార్తికేయ 2" సినిమాతో వెండితెరపై ప్రేక్షకులకు కనిపించబోతున్నారు. నిఖిల్ హీరోగా నటించి బ్లాక్ బస్టర్ అయిన కార్తికేయ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కనున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఈనెల 22వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది అని దర్శక నిర్మాతలు ప్రకటించారు. కానీ మళ్లీ సినిమా ఆగస్టు మొదటి వారంలో విడుదలవుతుందని నిఖిల్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

నాగచైతన్య మరియు రాశిఖన్నా హీరో హీరోయిన్లుగా నటించిన "థాంక్యూ" సినిమా కి నిర్మాత దిల్ రాజు సోలో రిలీజ్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కార్తికేయ 2 నిర్మాత తో మాట్లాడి ఈ సినిమాని ఆగస్టు మొదటి వారానికి వాయిదా వేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు కళ్యాణ్ రామ్ కూడా తన బింబిసారా సినిమాని అదే రోజున విడుదల చేయాలని అనుకుంటున్నారు.

అయితే "కార్తికేయ 2" సినిమా నిర్మాత సినిమాని జూలై 22 కి విడుదల చేయాలా లేదా అని ఇంకా ఆలోచనలో ఉండగానే నిఖిల్ సినిమా వాయిదా పడినట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇప్పుడో పెద్ద కన్ఫ్యూషన్ ని క్రియేట్ చేసింది. మరోవైపు అధికారిక లేకపోవడంతో డిస్టర్బ్యూటర్లు కూడా జులై 22 మంచి రిలీజ్ డేట్ అవుతుందని భావిస్తున్నారట. మరి ఈ సినిమాని ఎప్పుడు విడుదల చేస్తారో వేచి చూడాల్సిందే.

Rama Rao

Rama Rao

Next Story