18 Pages: నిఖిల్ '18 పేజెస్' నుంచి ఫస్టులుక్

Nikhil 18 Pages First Look Poster Release
x

నిఖిల్ సిద్దార్థ నటిస్తున్న 18 పేజెస్ ఫస్ట్ లుక్ (ఫైల్ ఇమేజ్)

Highlights

18 Pages: నేడునిఖిల్ పుట్టిన రోజు సందర్భంగా ఆయననటిస్తోన్న నిఖిల్‘18పేజెస్’ సినిమా ఫస్టు లుక్ రిలీజ్ చేసింది చిత్రం యూనిట్

18 Pages: అక్కినేని నట వారసుడు అక్కినే నిఖిల్ నటిస్తోన్న నిఖిల్'18పేజెస్' సినిమా నుండి ఫస్టు లుక్ విడుదలయ్యింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీవాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. విభిన్నమైన ప్రేమకథా నేపథ్యంలో నిర్మితమవుతున్న ఈ సినిమాలో, నిఖిల్ జోడీగా అనుపమ పరమేశ్వరన్ కనిపించనుంది. ఈ రోజున నిఖిల్ పుట్టిన రోజు .. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమా టీమ్ ఫస్టులుక్ ను రిలీజ్ చేసింది.

నాయకా నాయికల మధ్య గల ఫీలింగ్స్ కి అద్దం పడుతూ వదిలిన ఈ ఫస్టులుక్, యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. కథ .. స్క్రీన్ ప్లేను అందించింది సుకుమార్ కావడం విశేషం. గోపి సుందర్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అన అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories