Niharika Konidela: అందుకే సినిమాలు చేయట్లేదు అని అంటున్న మెగా హీరోయిన్

Niharika Konidela: తన భర్త వల్లే సినిమాలకి దూరంగా ఉంటున్నాను అంటున్న నీహారిక కొణిదెల

admin1
Published on: 25 Nov 2021 10:00 PM IST
Niharika Konidela Says she Stays Away From Movies Because of her Husband
X

నిహారిక కొణిదెల (ఫైల్ ఇమేజ్)

Niharika Konidela: మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. అయితే గతేడాది డిసెంబర్ లో పెళ్లి చేసుకున్న నిహారిక సినిమాలకు పూర్తిగా దూరమైంది. తాజాగా ఈటీవీ లో ప్రసారమయ్యే "ఆలీతో సరదాగా" షో కి విచ్చేసిన నిహారిక తన గురించి తన కుటుంబం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలని పంచుకుంది. తన కెరీర్ గురించి మాట్లాడుతూ పెళ్లయిన తర్వాత కూడా సమంత వంటి హీరోయిన్లు సినిమాల్లో నటించారు అని పెళ్లికి ముందు పెళ్లి తర్వాత వారి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అని అన్నారు నిహారిక.

కానీ తన భర్త చైతన్య జేవీ కి తాను సినిమాల్లో నటించడం ఇష్టం లేదని అందుకే తాను సినిమాలకి దూరంగా ఉంటుందని చెప్పుకొచ్చింది నిహారిక. అయితే సినిమాలకి దూరంగా ఉంటున్న నిహారిక ప్రస్తుతం ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. అంతేకాకుండా యూట్యూబర్ నిఖిల్ తో కలిసి ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించింది నిహారిక. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ విడుదల కాబోతోంది. మెగా బ్రదర్స్ లో ఎవరంటే ఇష్టం అని అడగగా తన తండ్రి నాగబాబు అంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన నిహారిక పెదనాన్న మరియు బాబాయి అంటే కూడా అంతే ఇష్టం అని చెప్పుకొచ్చింది.

admin1

admin1

Next Story