Niharika Konidela: విడాకులపై స్పందించిన నిహారిక.. అందరినీ వేడుకుంటున్నా..

Niharika Konidela: నటుడు నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల , చైతన్య జొన్నలగడ్డ తమ వైవాహిక బంధానికి ముగింపు పలికారు.

Arun Chilukuri
Published on: 5 July 2023 12:18 PM IST
Niharika Konidela Respond on her Divorce
X

Niharika Konidela: విడాకులపై స్పందించిన నిహారిక.. అందరినీ వేడుకుంటున్నా..

Niharika Konidela: నటుడు నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల , చైతన్య జొన్నలగడ్డ తమ వైవాహిక బంధానికి ముగింపు పలికారు. ఈ మేరకు వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. పరస్పర అంగీకారంతో హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో ఇందుకోసం దరఖాస్తు చేసుకోగా, నెలరోజుల కిందటే కోర్టు విడాకులను మంజూరు చేసింది. 2020 డిసెంబర్‌ 9న రాజస్థాన్‌లో నిహారిక వివాహం జరిగింది. డెస్టివేషన్‌ వెడ్డింగ్‌ పేరుతో నిహారిక, చైతన్య ఒక్కటయ్యారు. కాగా కొన్నాళ్ల నుండి చైతన్యకు నిహారిక దూరంగా ఉంటోంది. గతంలో వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్టు ప్రచారం కూడా జరిగింది. ఈ ప్రచారానికి పుల్ స్టాప్ పెడుతూ నిహారికకు కోర్టు విడాకులు మంజూరు అయిన డాక్యుమెంట్స్ ప్రత్యక్షం కావడంతో ప్రచారానికి తెరపడింది.

'విడాకుల విషయంలో మేమిద్దరం పరస్పర అంగీకారంతో నిర్ణయం తీసుకున్నాం. ఇది చాలా సున్నితమైన విషయం. తామిద్ద‌రం కొత్త‌గా ప్రారంభించే వ్య‌క్తిగ‌త జీవితంలో ప్రైవ‌సీని కోరుకుంటున్నాం. ఇంతటి ఇబ్బంది సమయంలో నా వెంట ఫ్యామిలీ, స్నేహితులు పిల్లర్స్‌లా నిలబడ్డారు. అందరినీ నేను రిక్వెస్ట్‌ చేస్తున్నాను.. మాపై నెగటివ్‌గా ప్రచారం చేయకండి. ఇలాంటి సమయంలో త‌మ‌ను దకయచేసి ఇబ్బంది పెట్ట‌కండి. ఇది ఒక కుటుంబానికి చెందిన వ్యక్తిగత విషయం. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.' అని తెలిపింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story