Night Curfew: టాలీవుడ్ కి షాక్ మీద షాక్ ..ఆరు దాటితే ఫ్యాక్ అప్ చెప్పాల్సిందే!

Night Curfew: తెలంగాణ ప్రభుత్వం విధించిన నైట్ కర్ఫ్యూ ప్రభావం సినీ ఇండస్ట్రీపై పడింది.

Arun Chilukuri
Published on: 20 April 2021 5:19 PM IST
Night Curfew Effect on Telugu Cinema Industry
X

Night Curfew: సినీ ఇండస్ట్రీపై తెలంగాణ నైట్ కర్ఫ్యూ ఎఫెక్ట్

Night Curfew: తెలంగాణ ప్రభుత్వం విధించిన నైట్ కర్ఫ్యూ ప్రభావం సినీ ఇండస్ట్రీపై పడింది. సినిమా షూటింగ్స్ సాయంత్రం 6గంటల వరకే చేసుకోవాలని సినిమా షోస్‌ టైమ్ కూడా మారే అవకాశం ఉంది. రాత్రి షూటింగ్స్ ఏప్రిల్ 30 వరకు క్యాన్సిల్ చేసుకున్నారు. నాన్‌ స్టాప్‌గా షూటింగ్స్ చేసుకుంటున్న చిన్న, పెద్ద సినిమాలపై కర్ఫ్యూ ఎఫెక్ట్ భారీగానే ఉండనుంది. నైట్ షెడ్యూల్‌ను క్యాన్సిల్ చేసుకుని మార్నింగ్ ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఇదివరకే స్టార్ట్ అయిన సినిమాల షూటింగ్స్ కు మాత్రం కాస్త రిలీఫ్ ఇచ్చే అవకాశం ఉంది.

మరోవైపు సినిమాల షో టైం కూడా మారుతున్నాయి. ఇప్పటి వరకు ఉదయం 8.45 నుంచి రాత్రి 10.30వరకు పలు షోలు ఉండేవి కానీ, కర్ఫ్యూ సమయంలో రాత్రి 6వరకే షోలు వేసే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా టైం కూడా మారే ఛాన్స్ ఉంది. అవసరం అయితే ఒక షో క్యాన్సిల్ కూడా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే రోజుకు మూడు షోలు మాత్రమే వేసుకునే ఛాన్స్ ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story