'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో తన పాత్ర ఇదే అంటున్న నిధి అగర్వాల్

ఇస్మార్ట్ శంకర్ సినిమాలో తన పాత్ర ఇదే అంటున్న నిధి అగర్వాల్
x
Highlights

బెంగళూరు అమ్మాయి నిధి అగర్వాల్ నాగచైతన్య నటించిన 'సవ్యసాచి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సినిమా తరువాత ఈ మధ్యనే అక్కినేని అఖిల్ సరసన...

బెంగళూరు అమ్మాయి నిధి అగర్వాల్ నాగచైతన్య నటించిన 'సవ్యసాచి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సినిమా తరువాత ఈ మధ్యనే అక్కినేని అఖిల్ సరసన 'మిస్టర్ మజ్ను' సినిమాలో నటించింది. అయితే మొదటి రెండు సినిమాలు ఈమెకు మంచి పేరు తెచ్చి పెట్టలేక పోయాయి. తాజాగా ఈమె తన ఆశలన్నీ రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'ఇస్మార్ట్ శంకర్' అనే సినిమాపైనే పెట్టుకుంది. ఈ మధ్యనే ఈ సినిమా షూటింగ్ లో హైదరాబాద్ లో జరిగిన మొదటి షెడ్యూల్ లో కూడా పాల్గొంది.

ఒక ఇంగ్లీషు పత్రిక కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో నిధి మాట్లాడుతూ ఈ సినిమాలో తన పాత్ర గురించి చెప్పింది. ఈ సినిమాలో ఒక సైంటిస్ట్ పాత్రలో కనిపించబోతుందని, ఆ పాత్ర చేయడం చాలా ఎగ్జైటింగ్ గా ఉందని చెప్పింది నిధి. అంతే కాక నిజ జీవితంలో తాను సైంటిస్ట్ అవ్వాలి అనుకుంది కానీ కనీసం సినిమాలో అయినా అయినందుకు సంతోషంగా ఉందని అంటోంది. తన పాత్ర కోసం పుస్తకాలు మరియు కేస్ స్టడీస్ చదువుతున్నానని కొన్ని హాస్పిటల్స్ కు కూడా వెళ్లి రీసెర్చ్ చేశానని చెబుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories