రాజాసాబ్ తర్వాత నా మీద ప్రేక్షకుల ఒపీనియన్ మారిపోతుంది: నిధి అగర్వాల్

Nidhi Agarwal Interesting Comments On Rajasaab
x

రాజాసాబ్ తర్వాత నా మీద ప్రేక్షకుల ఒపీనియన్ మారిపోతుంది: నిధి అగర్వాల్

Highlights

నిధి అగర్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరంలేదు. సవ్యసాచి సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన నిధి.. తన క్యూట్ అందాలతో అందర్నీ మెస్మరైజ్ చేసింది.

Nidhi Agarwal Interesting Comments On Rajasaab: నిధి అగర్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరంలేదు. సవ్యసాచి సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన నిధి.. తన క్యూట్ అందాలతో అందర్నీ మెస్మరైజ్ చేసింది. సవ్యసాచి సక్సెస్ కాకపోయినప్పటికీ నిధి అందం, అభినయానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. వరుసగా అవకాశాలు వచ్చినప్పటికీ ఇస్మార్ శంకర్ మినహా మరే చిత్రం ఆమెకు గుర్తింపు తీసుకురాలేదు. సక్సెస్ లేకపోయినా అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం నిధి అగర్వాల్ ఇద్దరు టాలీవుడ్ అగ్ర హీరోల సరసన నటిస్తోంది. పవన్ సరసన హరిహర వీరమల్లులో, ప్రభాస్‌తో రాజాసాబ్‌లోనూ నటిస్తున్నారు. ఇవి రెండూ పాన్ ఇండియా సినిమాలే.

అయితే ఈ సినిమాల నుంచి ఎప్పుడు అప్డేట్స్ వస్తాయా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిధి అగర్వాల్ రాజాసాబ్ సినిమాలోని తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రేక్షకులు ఎక్కువగా నా నుంచి గ్లామర్ పాత్రలను ఆశిస్తుంటారు. నేను కూడా అలాంటి పాత్రలే ఎక్కువగా చేస్తానని భావిస్తారు. అయితే రాజాసాబ్ తో మాత్రం ప్రజలు ఖచ్చితంగా నాపై ఉన్న ఈ అభిప్రాయాన్ని మార్చుకుంటారని అనిపిస్తుందన్నారు. ఈ సినిమాలో నా పాత్ర రెగ్యులర్ హాట్ పాత్రలకు భిన్నంగా ఉంటుంది. ఇది అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పగలనన్నారు. ఇందులో నా పాత్రను ప్రేక్షకులు ఊహించలేరు అని చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్.

మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సినిమా రూపొందుతుంది. ప్రభాస్ మొదటిసారి హర్రర్ నేపథ్యం ఉన్న కథలో నటిస్తున్నారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమాపైనే ఉంది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధికుమార్, సంజయ్ దత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం నిధి చేసిన కామెంట్స్ రాజాసాబ్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories