Nidhhi Agerwal: "హరిహర వీరమల్లు పీరియడ్ సినిమా" అంటున్న నిధి అగర్వాల్

Nidhhi Agerwal: పవన్ కళ్యాణ్ సినిమాలో తన పాత్ర గురించి చెబుతున్న నిధి అగర్వాల్

admin1
Published on: 13 Jan 2022 8:12 AM IST
Nidhhi Agerwal Tells About Role in  Pawan Kalyan Movie | Tollywood News Online
X

 "హరిహర వీరమల్లు పీరియడ్ సినిమా" అంటున్న నిధి అగర్వాల్

Nidhhi Agerwal: "భీమ్లా నాయక్" సినిమాతో మంచి హిట్ ను అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఇప్పుడు "హరి హర వీర మల్లు" అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే నిధి అగర్వాల్ కి సంబంధించిన పోస్టర్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నిధి అగర్వాల్ ఈ సినిమా గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియ జేసింది. సినిమా ఫస్ట్ హాఫ్ షూటింగ్ పూర్తయినట్లు తెలియజేసింది నిధి అగర్వాల్.

"ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చక్కబడే షూటింగ్ మళ్లీ మొదలవుతుంది. ఇప్పటిదాకా నేను చేసిన పాత్రలో ఇదే నా బెస్ట్. అంతేకాకుండా ఇదే నా బెస్ట్ పర్ఫామెన్స్ అని చెబుతాను" అంటోంది నిధి అగర్వాల్. అయితే సినిమా ఎలా ఉండబోతోంది అని అడగగా హరిహర వీరమల్లు ఒక పూర్తి పీరియడ్ సినిమా అని కానీ వేరు వేరు పీరియడ్స్లో కథ సాగుతుందని సినిమా మొత్తం తన పాత్ర నిడివి ఉంటుందని చెప్పుకొచ్చిన నిధి పవన్ కళ్యాణ్ ఒక పాజిటివ్ మనిషి అంటూ ఆయన పై ప్రశంసల వర్షం కురిపించింది.

admin1

admin1

Next Story