Nidhhi Agerwal: "సినిమాలో నేను యువరాణిని" అంటున్న నిధి అగర్వాల్

* ఈ సినిమాతో తెరపై తనలోని ఒక డిఫరెంట్ వెర్షన్ చూపించబోతున్న అందుకు చాలా ఆనందంగా ఉందని అంటోంది నిధి.

admin1
Updated on: 10 Oct 2021 2:53 PM IST
Nidhhi Agerwal says that I am a Princess in Hari Hara Veera Mallu Movie
X

హరి హర వీర మల్లు సినిమా (ఫైల్ ఫోటో)

Nidhhi Agerwal: హైదరాబాద్ బ్యూటీ నిధి అగర్వాల్ నాగచైతన్య హీరోగా నటించిన "సవ్యసాచి" సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత "మిస్టర్ మజ్ను" సినిమా తో ప్రేక్షకులను అలరించిన నిధి అగర్వాల్ ఈ మధ్యనే "ఇస్మార్ట్ శంకర్" సినిమా తో మంచి హిట్ ను అందుకుంది. తాజాగా ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న "హరిహర వీరమల్లు" సినిమా లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

తన పాత్ర గురించి మాట్లాడుతూ, "నా పాత్ర పేరు పంచమి. ఆమె ఒక యువరాణి. కానీ మిగతా యువరాణిల లాగా ఎవరో ఒకరు వచ్చి తనని కాపాడుతారు అని ఎదురు చూసే రకం కాదు. తన గురించి చెప్పాలంటే చాలా ఉంది. నేను నటించిన చాలెంజింగ్ పాత్ర ఇప్పటిదాకా ఇదే. అన్ని ఆభరణాలు మేకప్ వేసుకోవడం అంత సులభం కాదు. వాటితో కనీసం బాత్రూంకి కూడా వెళ్లే అవకాశం లేదు.

ఒకసారి పొద్దున షూటింగ్ కి రెడీ అయిపోతే తర్వాత మళ్లీ నడుం వాల్చే అవకాశం కూడా దొరకదు. ఆభరణాలు చాలా బరువు ఉండడం తో నాకు బాడీ పెయిన్స్ వస్తున్నాయి," అని చెప్పుకొచ్చిన నిధి అగర్వాల్ అభిమానులు తనని గ్లామరస్ గర్ల్ అని పిలుస్తుండటం ఆమెకి నచ్చలేదని, ఈ సినిమాతో తెరపై తనలోని ఒక డిఫరెంట్ వెర్షన్ చూపించబోతున్న అందుకు చాలా ఆనందంగా ఉందని అంటోంది నిధి.

admin1

admin1

Next Story