ఒక్క యాడ్ వల్ల నిధి అగర్వాల్ ను తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

Nidhhi Agerwal Gets Trolled For Video On Condom Experience
x

ఒక్క యాడ్ వల్ల నిధి అగర్వాల్ ను తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

Highlights

Nidhhi Agerwal: నాగచైతన్య హీరోగా నటించిన "సవ్యసాచి" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయిన నిధి అగర్వాల్.

Nidhhi Agerwal: నాగచైతన్య హీరోగా నటించిన "సవ్యసాచి" సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయిన నిధి అగర్వాల్. అక్కినేని అఖిల్ సరసన మిస్టర్ మజ్ను సినిమాలో కనిపించింది. అయితే ఈ రెండు సినిమాల్లో పెద్దగా హిట్ అవ్వలేకపోయినా రామ్ పోతినేని హీరోగా నటించిన "ఇస్మార్ట్ శంకర్" సినిమా తో మంచి క్రేజ్ అందుకుంది. అప్పటి నుంచి తన గ్లామరస్ ఫోటోషూట్స్ తో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉండే నిధి అగర్వాల్ తాజాగా ఒక కాండమ్ కంపెనీని ప్రమోట్ చేసి దానికి సంబంధించిన వీడియో ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది.

ఆ వీడియోలో అసభ్యకరమైన కంటెంట్ ఏమీ లేకపోయినా అందులో ఆమె వాడిన కొన్ని పదాలు వల్ల నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. దాదాపు అందరూ పెద్ద హీరోలతో నటిస్తున్న నిధి అగర్వాల్ కాండమ్ వీడియోలో అలాంటి అసభ్యకరమైన పదాలు వాడుతూ కనిపించడంతో నెటిజన్లు ఆమెను సోషల్ మీడియా ద్వారా తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇక నిధి అగర్వాల్ మాత్రం ఈ ట్రోల్స్ పై మౌనం వహిస్తోంది. మరోవైపు సినిమాల పరంగా చూస్తే నిధి అగర్వాల్ త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన "హరి హర వీర మల్లు" సినిమాలో కనిపించనుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories