Ustaad Bhagat Singh: హైదరాబాద్ శివారుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ కోసం భారీ సెట్..ఫైట్ బద్దలవుతుంది

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి ఉన్న క్రేజ్ టాలీవుడ్ లో ఏ హీరోకి లేదంటే అతిశయోక్తి కాదు.

Dhatripriya
Updated on: 6 Jun 2023 10:00 PM IST
Next Schedule Of Pawan Kalyan’s Ustaad Bhagat Singh To Begin in Hyderabad
X

Ustaad Bhagat Singh: హైదరాబాద్ శివారుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ కోసం భారీ సెట్.. ఫైట్ బద్దలవుతుంది..

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి ఉన్న క్రేజ్ టాలీవుడ్ లో ఏ హీరోకి లేదంటే అతిశయోక్తి కాదు. ఇప్పటి వరకు చేసింది తక్కువ సినిమాలే అయినా ఆయనకు ఉన్నంత ఫ్యాన్ బేస్ ఎవరికీ లేదనే చెప్పాలి. ప్రస్తుతం పవన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వీటిలో సుజిత్ దర్శకత్వంలో చేస్తున్న OG, హరీష్ శంకర్ కాంబినేషన్ లో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల్లో బ్యాక్ టు బ్యాక్ నటిస్తున్నారు. వీటిలో ఉస్తాద్ భగత్ సింగ్ రెగ్యులర్ షూటింగ్ ఈమధ్యనే ప్రారంభమై మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకోగా ఇందుకు సంబంధించి మేకర్స్ గ్లిమ్స్ ని రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

పవన్ ఫ్యాన్స్ అంతా OGపై ఫోకస్ చేసిన వేళ విడుదలైన గ్లిమ్స్..ఒక్కసారిగా ఉస్తాద్ భగత్ సింగ్ వైపు చూసేలా చేసింది. హరీష్ శంకర్ పవన్ లోని వింటేజ్ లుక్ ని బయటకు తీయడమే కాకుండా అదిరిపోయే హిట్టిస్తున్నాడంటూ ఫ్యాన్స్ తెగ ఖుషి అయ్యారు.

ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ కి సంబంధించి రెండవ షెడ్యూల్ కార్యక్రమాలు చకచకా జరుగుతున్నాయి. సెకండ్ షెడ్యూల్ కి సంబంధించి హైదరాబాద్ లో భారీ సెట్ వేస్తున్నట్లుగా మూవీ టీం వీడియో ని రిలీజ్ చేసింది. ఈ సెట్స్ చూస్తుంటే కాలేజీ సెటప్ లా ఉంద. ఈ సెట్ లో ఇంటర్వెల్ ఫైట్ ని షూట్ చేస్తారని తెలుస్తోంది. పవన్ కల్యాణ్ చిత్రాల్లో ఫైట్ సన్నివేశాలకు ఎంత ప్రయార్టీ ఉంటుందో మనకు తెలిసిందే. ఆయన ఇమేజ్ కు తగ్గట్టు పవన్ మార్క్ డైలాగ్స్ తో, రిస్కీ స్టంట్స్ తో ఫైట్ ను చిత్రీకరిస్తారట.

మొత్తంగా, ఉస్తాద్ భగత్ సింగ్ ఇంటర్వెల్ బ్లాక్ ను దర్శకుడు హరీష్ శంకర్ పవన్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ గా నిలిపేందుకు కృషి చేస్తున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ని ఈ ఏడాదిలో కంప్లీట్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా, ఫస్ట్ గ్లింప్స్ తో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించిన హరీష్ శంకర్ 11 ఏళ్ల గ్యాప్ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాతో పవన్ ఫ్యాన్స్ ఆకలి తీరడం ఖాయంలా ఉంది.

Dhatripriya

Dhatripriya

Next Story