ప్రభాస్ 'ది రాజాసాబ్' టీజర్‌ లాంచ్‌పై మారుతి, నిర్మాతల ఆసక్తికర కామెంట్స్ – నెగటివ్ క్యాంపెయిన్‌కు కౌంటర్

ప్రభాస్ ది రాజాసాబ్ టీజర్‌ లాంచ్‌పై మారుతి, నిర్మాతల ఆసక్తికర కామెంట్స్ – నెగటివ్ క్యాంపెయిన్‌కు కౌంటర్
x

ప్రభాస్ 'ది రాజాసాబ్' టీజర్‌ లాంచ్‌పై మారుతి, నిర్మాతల ఆసక్తికర కామెంట్స్ – నెగటివ్ క్యాంపెయిన్‌కు కౌంటర్

Highlights

ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో రూపొందుతున్న 'ది రాజాసాబ్' టీజర్‌ విడుదల సందర్భంగా డైరెక్టర్‌, నిర్మాతలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నెగటివ్ క్యాంపెయిన్‌కు ధీటుగా స్పందించారు.

ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'ది రాజాసాబ్' (The Raja Saab) డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రొమాంటిక్ కామెడీ హారర్ మూవీ టీజర్ తాజాగా విడుదల కాగా, ఈ సందర్భంగా హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఇందులో దర్శకుడు మారుతి, నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్‌, ఎస్‌కేఎన్‌లు పాల్గొన్నారు.

‘‘మారుతితో అవసరమా?’’ అన్న వారిని అడగండి: మారుతి

డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ – ‘‘ప్రభాస్ గారి నుంచి సినిమా ఆఫర్ రావడం నా జీవితాన్ని మార్చేసింది. ఆ సమయంలో 'పక్కా కమర్షియల్' పరాజయం చెందిన తర్వాత చాలా మంది ఈ ప్రాజెక్ట్‌ మీద అనుమానాలు వ్యక్తం చేశారు. 'మారుతితో అవసరమా?' అన్న వారిని ప్రభాస్ గారు పట్టించుకోలేదు. ఆయన నన్ను నమ్మారు, పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు,’’ అని చెప్పారు.

‘‘ఇది నా జీవితంలో అత్యంత భావోద్వేగంతో కూడిన రోజు. అభిమానులకు వింటేజ్ డార్లింగ్‌ను చూపించాలన్నది మా ఉద్దేశ్యం. ప్రభాస్ లైఫ్‌లో ముగ్గురు హీరోయిన్స్‌ సెట్ చేశాం (నవ్వుతూ). టీజర్‌తో ఈ ప్రపంచాన్ని పరిచయం చేశాం కానీ సినిమా ఎలా ఉంటుందో మీ ఊహకు అందదు’’ అని మారుతి తెలిపారు.

నెగటివ్ క్యాంపెయిన్‌కు ధీటుగా: ఎస్‌కేఎన్

సహనిర్మాత ఎస్‌కేఎన్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా ప్రారంభమైనప్పుడు ఓ నిర్మాత నెగెటివ్ క్యాంపెయిన్ చేశాడు. కానీ డిసెంబర్ 5న అదే నిర్మాత పాజిటివ్‌గా మాట్లాడతారు. ఈ సినిమా ద్వారా ప్రభాస్ అభిమానులు గత 10 ఏళ్లుగా మిస్ అయిన రిబెల్ స్టార్‌ ప్రభాస్‌ను తిరిగి చూడబోతున్నారు. SKN, మారుతి కాంబినేషన్‌ ఓ కొత్త చరిత్రను రాస్తుంది’’ అని ధీమా వ్యక్తం చేశారు.

‘‘ఇది మా బ్యానర్‌కు బిగ్గెస్ట్ మూవీ’’: విశ్వప్రసాద్

నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ – ‘‘ప్రభాస్‌ను కలిసినప్పుడు కంగారు పడిపోయాను. కానీ ఆయన చాలా హ్యుమ్బుల్. మొదటి 10 నిమిషాల్లోనే ‘చేస్తా’ అన్నారు. 2024లో మా బ్యానర్‌ నుంచి వచ్చిన కొన్ని సినిమాలు నిరాశపర్చినా, ‘ది రాజాసాబ్’ వాటికి సమాధానం. ఇది మా పీపుల్ మీడియా ఫ్యాక్టరీకు బిగ్గెస్ట్ మూవీ అవుతుంది’’ అని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories