శేఖర్ కమ్ములపై రాజమౌళి ప్రశంసల వర్షం: “అయన నమ్మిన సిద్ధాంతాలకు ఒక్క ఇంచ్ కూడా వెనక్కి తగ్గరు”

శేఖర్ కమ్ములపై రాజమౌళి ప్రశంసల వర్షం: “అయన నమ్మిన సిద్ధాంతాలకు ఒక్క ఇంచ్ కూడా వెనక్కి తగ్గరు”
x

శేఖర్ కమ్ములపై రాజమౌళి ప్రశంసల వర్షం: “అయన నమ్మిన సిద్ధాంతాలకు ఒక్క ఇంచ్ కూడా వెనక్కి తగ్గరు”

Highlights

రాజమౌళి, శేఖర్ కమ్ములని “విలువలకు కట్టుబడి ఉండే అరుదైన దర్శకుడు”గా కొనియాడారు. కుబేర ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ ఎస్‌.ఎస్‌. రాజమౌళి తనయ శైలికి విరుద్ధమైన దర్శకుడిని ఏకంగా మెచ్చుకున్నారు. ‘కుబేర’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ సందర్భంగా డైరెక్టర్ శేఖర్ కమ్ములపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనకన్నా జూనియర్ అనుకున్న శేఖర్ నిజానికి ఇండస్ట్రీలో ఒక సంవత్సరం సీనియర్ అని కూడా పేర్కొన్నారు.

“మేమిద్దరం పూర్తి భిన్నమైన Poles” – రాజమౌళి

ఈ ఈవెంట్‌లో ప్రసంగించిన రాజమౌళి, “శేఖర్ కమ్ముల చాలా హంబుల్. కానీ తన నమ్మకాలను ఎంతకీ వదలరు. ఒక్క ఇంచ్ కూడా పక్కకు తొలగరు” అని అన్నారు.

అలాగే, “అతను తాను నమ్మిన విలువల ఆధారంగా సినిమాలు తీస్తాడు. నేను నా సినిమాల్లో కమర్షియల్ కాన్సెప్ట్‌లు తీసుకుంటా. మేమిద్దరం పూర్తిగా విభిన్నమైన పథాలలో నడుస్తున్నాం. కానీ ఆయనపై నాకు అమితమైన గౌరవం ఉంది” అని రాజమౌళి పేర్కొన్నారు.

“నాకు జూనియర్ అనుకున్నా.. కానీ నిజంగా సీనియర్”

రాజమౌళి మాట్లాడుతూ, “శేఖర్ 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు అని తెలిసి నమ్మలేకపోయాను. నాకు జూనియర్ అనుకున్నాను కానీ నిజంగా ఒక సంవత్సరం సీనియర్ తానే. ఆయన కెరీర్ మొత్తం ఓ స్థిరమైన విలువలతో నడిచారు. ఇదే శైలిలో కొనసాగాలని కోరుకుంటున్నాను” అన్నారు.

‘కుబేర’ ట్రైలర్‌పై రాజమౌళి స్పందన

రాజమౌళి మాట్లాడుతూ, “నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా వంటి స్టార్ కాస్టింగ్‌తో ‘కుబేర’ అనౌన్స్‌మెంట్ వచ్చేసరికి చాలా ఫ్రెష్‌గా అనిపించింది. ట్రైలర్ చూస్తే, ఇది ఒక మైండ్-బ్లోయింగ్ విజువల్ ఎక్స్‌పీరియెన్స్ అనిపించింది. శేఖర్ కమ్ముల సాధారణంగా ట్రైలర్‌ లోనే కథ చూపిస్తారు. కానీ కుబేర విషయంలో కథను సస్పెన్స్‌గా ఉంచారు” అని వివరించారు.

“కథలో డబ్బుదారి vs సాధారణ జీవితం – విభిన్న ప్రపంచాలు”

“ట్రైలర్‌లో నాగార్జున గారు ఒక రిచ్ క్యారెక్టర్, ధనుష్ గారు పూర్ బ్యాక్‌డ్రాప్‌లో కనిపించటం.. ఇద్దరిని ఎలా కలిపాడు? కథలో డైరమా ఏంటి? అన్నదే చాలా ఆసక్తికరంగా ఉంది” అని రాజమౌళి పేర్కొన్నారు.

“కుబేర పాటలు, విజువల్స్ టాప్ క్లాస్”

రాజమౌళి తన స్పీచ్‌ను ఇలా ముగించారు:

“దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అద్భుతంగా ఉంది. ‘నాది నాది’ సాంగ్, కుబేర థీమ్ మ్యూజిక్ ఫెంటాస్టిక్.

జూన్ 20న విడుదలవుతున్న కుబేర సినిమాను ఎవ్వరు మిస్ కాకండి” అని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories