పబ్‌లో కల్పిక హంగామా.. బూతులు, ప్లేట్లు విసురుతూ దురుసు ప్రవర్తన! పోలీసులు కేసు నమోదు.

పబ్‌లో కల్పిక హంగామా.. బూతులు, ప్లేట్లు విసురుతూ దురుసు ప్రవర్తన! పోలీసులు కేసు నమోదు.
x

పబ్‌లో కల్పిక హంగామా.. బూతులు, ప్లేట్లు విసురుతూ దురుసు ప్రవర్తన! పోలీసులు కేసు నమోదు.

Highlights

టాలీవుడ్ నటి కల్పిక గచ్చిబౌలి ప్రిజం పబ్‌లో బిల్లు వివాదంపై ఘర్షణకు దిగింది. బూతులు, బాడీ షేమింగ్, ప్లేట్లు విసరడంతో కల్పికపై పోలీసులు కేసు నమోదు చేశారు.

హైదరాబాద్‌: టాలీవుడ్‌ నటి కల్పిక మరోసారి వార్తల్లో నిలిచింది. గచ్చిబౌలి ప్రిజం పబ్‌ (Prism Pub)లో జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఆమెపై పోలీసులు బీఎన్‌ఎస్‌ చట్టంలోని 324(4), 352, 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పబ్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు, కల్పిక బిల్‌ చెల్లించకుండా అసభ్యంగా ప్రవర్తించి, బాడీ షేమింగ్, బూతుల తిట్లు, ప్లేట్లు విసరడం వంటి చర్యలకు పాల్పడినట్లు ఆరోపించారు.

బర్త్‌డే కేక్‌ నుంచే ప్రారంభమైన వివాదం!

వివాదానికి మూలం ఓ బర్త్‌డే పార్టీ. గణేష్‌ పుట్టినరోజు సందర్భంగా తన స్నేహితులతో కలిసి ప్రిజం పబ్‌లో పార్టీ నిర్వహించిన కల్పిక, కేక్ సర్వ్ చేయడంపై పబ్ సిబ్బందితో ఘర్షణకు దిగినట్లు సమాచారం. ఇదే క్రమంలో మాటల యుద్ధం ముదిరి అసభ్య ప్రవర్తనగా మారినట్లు పబ్ యాజమాన్యం తెలిపింది.

వైరల్ వీడియోలతో కల్పిక వర్షన్‌

ఇక మరోవైపు కల్పిక మాత్రం సిబ్బంది తమపై దాడి చేశారంటూ ఆరోపిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోల్లో కల్పిక పబ్ బయట నిలబడి, తనపై జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ, సిబ్బంది క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ మాట్లాడిన దృశ్యాలు కనిపిస్తున్నాయి.

సినీ పరిశ్రమలో కల్పిక ప్రయాణం

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'జులాయి', 'యశోద', 'హిట్ - 1', 'పడి పడి లేచే మనసు', 'సారొచ్చారు' వంటి సినిమాల్లో నటించిన కల్పిక తరచూ వివాదాల్లో చిక్కుకుంటూ వస్తోంది. తాజా పబ్‌ ఘర్షణ కేసుతో మరోసారి వార్తల్లోకి ఎంటరైంది. ప్రస్తుతం కేసుపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతోంది. చట్టపరంగా కల్పికపై చర్యలు తీసుకునే అవకాశాలున్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories