‘తమ్ముడు’ మూవీ ట్రైలర్ రిలీజ్ – నితిన్, శ్రీరామ్ వేణు కాంబో సర్‌ప్రైజ్‌కు సిద్ధం!

‘తమ్ముడు’ మూవీ ట్రైలర్ రిలీజ్ – నితిన్, శ్రీరామ్ వేణు కాంబో సర్‌ప్రైజ్‌కు సిద్ధం!
x

‘తమ్ముడు’ మూవీ ట్రైలర్ రిలీజ్ – నితిన్, శ్రీరామ్ వేణు కాంబో సర్‌ప్రైజ్‌కు సిద్ధం!

Highlights

నితిన్‌ హీరోగా, శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ‘తమ్ముడు’ మూవీ జూలై 4న విడుదలకు సిద్ధం. సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉండనుంది. ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది.

యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'తమ్ముడు' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, దిల్ రాజు-శిరీష్ నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. జూలై 4న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

స్టార్ కాస్ట్‌తో ఆసక్తికర కాంబినేషన్

ఈ సినిమాలో నితిన్‌ సరసన ‘కాంతారా’ ఫేమ్ సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, స్వసిక విజయన్, లయ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విభిన్న కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుందని యూనిట్ చెబుతోంది.

దర్శకుడు శ్రీరామ్ వేణు మాటల్లో..

‘‘ఈ సినిమాకి ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. ఓ సరికొత్త స్క్రీన్‌ప్లే, ఎమోషనల్ కంటెంట్‌తో తెరకెక్కించాం. నితిన్‌ తన కోసం కాకుండా సినిమాకి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి. మా ముగ్గురం పవన్ కళ్యాణ్ అభిమానులం. అందుకే ఈ సినిమాకి ‘తమ్ముడు’ అనే శక్తివంతమైన టైటిల్ పెట్టాం’’ అన్నారు శ్రీరామ్ వేణు.

“జూలై 4న సినిమా మాట్లాడుతుంది”

ట్రైలర్ లాంచ్ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ,

‘‘ఈ సినిమా తప్పకుండా అందరినీ సర్‌ప్రైజ్ చేస్తుంది. చాలా ఎమోషనల్, యాక్షన్ ప్యాక్డ్ సినిమా. ఇప్పుడే ఎక్కువ చెప్పలేను. జూలై 4న సినిమానే మాట్లాడుతుంది’’ అన్నారు.

డైరెక్టర్, హీరో సెట్స్‌లో గొప్ప త్యాగం - దిల్ రాజు మాట్లాడుతూ,

‘‘ఈ ఏడాది థియేటర్లలో విడుదలైన చిత్రాల్లో 4-5 సినిమాలే హిట్ అయ్యాయి. ‘తమ్ముడు’ చిత్ర షూటింగ్ ఎక్కువ రోజులు జరగడంతో బడ్జెట్ పెరిగింది. డైరెక్టర్ శ్రీరామ్‌ వేణు మాటలు వింటే ఆశ్చర్యమేసింది – ‘ఇప్పటి వరకూ తీసుకున్న దానికే సరిపోతుంది. ఇకపై ఒక్క రూపాయీ తీసుకోను. సినిమా హిట్ అయితే తగినంత పారితోషికం ఇవ్వండి’ అన్నారు. నా 22 ఏళ్ల కెరీర్‌లో ఇలాంటి డైరెక్టర్ చూడలేదు. అలాగే, నితిన్‌ కూడా పారితోషికం విషయంలో పెద్ద సపోర్ట్‌గా నిలిచారు’’ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories