
మలయాళ హిట్ మూవీ 'పడక్కలం' ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి!
మలయాళ సూపర్ నేచురల్ ఫాంటసీ కామెడీ మూవీ 'పడక్కలం' ఇప్పుడు తెలుగు డబ్‌తో ఓటీటీలో విడుదల. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ థ్రిల్లింగ్ మూవీ కథ, నటన, వినోదం ఎలా ఉన్నాయో తెలుసుకోండి!
నటీనటులు, డైరెక్టర్, బడ్జెట్ & కలెక్షన్ల వివరాలు
ఈ చిత్రంలో సందీప్ ప్రదీప్, సూరజ్ వెంజరమూడు, షరాఫుద్దీన్ వంటి నటులతో పాటు కొత్త ముఖాలు ప్రధాన పాత్రల్లో నటించారు. డైరెక్టర్ మను స్వరాజ్ తొలి సినిమాతోనే డిఫరెంట్ కాన్సెప్ట్‌కు ప్రాధాన్యం ఇస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. రూ.10 కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా, రూ.20 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి కమర్షియల్ హిట్‌గా నిలిచింది.
కథలోకి వెళ్తే... స్నేహం, పవర్, ఫాంటసీ కలయిక
కథ నలుగురు స్నేహితుల (జతిన్, నకుల్, కన్నన్, రామ్) చుట్టూ తిరుగుతుంది. కాలేజీ నేపథ్యంలో సాగే ఈ కథలో, రంజిత్ అనే లెక్చరర్ వద్ద ఓ మిస్టరీ లాకెట్ ఉంటుంది. అదే అతడికి ప్రత్యేక శక్తులను అందిస్తుంది. ఈ పవర్‌ను ఉపయోగించి రంజిత్, కో లెక్చరర్ షాజీని మైండ్ కంట్రోల్ చేస్తాడు. ఈ విషయం తెలిసిన స్టూడెంట్లు రంజిత్ వద్దున్న బ్యాగును, ఆపై లాకెట్‌ను దొంగిలిస్తారు.
జుమాంజీ టచ్‌తో గేమ్ ప్రారంభం... కథలో ట్విస్ట్
లాకెట్‌తో కలిసి ఉన్న బాక్స్‌ను తెరిచి ఒక మిస్టరీ గేమ్‌ను ప్రారంభించడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ సమయంలో వచ్చిన షాజీతో ఆత్మల మార్పిడి జరుగుతుంది — షాజీ ఆత్మ రంజిత్ శరీరంలోకి, జతిన్ ఆత్మ షాజీ శరీరంలోకి... ఇలా పాత్రలు మారిపోతూ కథ ఉత్కంఠభరితంగా మారుతుంది. ‘హలో బ్రదర్’ టైప్ కామెడీ రియాక్షన్లు ప్రేక్షకులను ఎంజాయ్ చేయేలా చేస్తాయి.
ఎలాంటి అనర్థాలు? గేమ్ నుంచి ఎలా బయటపడ్డారు?
ఈ మిస్టరీ గేమ్ నుంచి ముగ్గురు స్నేహితులు ఎలా బయటపడ్డారు? రంజిత్ శక్తులకు అడ్డుకట్ట వేసారా? అనే ప్రశ్నలకు థ్రిల్లింగ్ మలుపులతో సినిమాలో సమాధానం దొరుకుతుంది. కథ కాస్త కాంప్లెక్స్‌గా అనిపించినా, స్క్రీన్‌ప్లే ఆసక్తికరంగా సాగుతుంది. ఎక్కడా అసభ్యత లేకుండా కుటుంబంతో చూడదగ్గ చిత్రంగా ‘పడక్కలం’ నిలిచింది.
టెక్నికల్స్ & పెర్ఫార్మెన్స్
సినిమాలో హీరోయిన్ లేకపోయినా, నటీనటుల పెర్ఫార్మెన్స్ బావుంది. కామెడీ, థ్రిల్, ఫాంటసీ మిక్స్‌తో రెండు గంటలపాటు కథ ఎక్కడా బోర్ కొట్టకుండా కొనసాగుతుంది. డైలాగుల డెలివరీ కొద్దిగా స్పీడుగా ఉండడంతో కొంత గ్యాప్ లేకుండా వచ్చే సంభాషణలు కన్ఫ్యూజ్ చేస్తే తప్పా, మిగతా అన్ని అంశాలు బాగున్నాయి.
ఎక్కడ చూడొచ్చు?
'పడక్కలం' ఇప్పుడు జియో హాట్‌స్టార్ (JioCinema/Disney+ Hotstar) లో మలయాళంతో పాటు తెలుగు డబ్‌లోనూ స్ట్రీమింగ్‌లో అందుబాటులో ఉంది. ఈ వారం-END ఫ్యామిలీతో కలిసి వేరే రకమైన కాన్సెప్ట్ ఉన్న సినిమా చూడాలనుకునే వారికి ఇది మిస్ అవ్వకూడదనేది మా సూచన.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




