Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ట్విస్టులు

Tollywood Drugs Case: ఎక్సైజ్ కేసు ఆధారంగా విచారిస్తున్న ఈడీ * కెల్విన్ ఇచ్చిన సమాచారంతో ఈడీ విచారణ

Sandeep Eggoju
Updated on: 1 Sept 2021 3:01 PM IST
New Twists in Tollywood Drugs Case
X

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్టులు (ఫైల్ ఇమేజ్)

Tollywood Drugs Case: టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈడీ దర్యాప్తు స్పీడప్ చేసింది. ఈ కేసులో విచారిస్తున్న కొద్ది ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. ఎక్సైజ్ కేసు ఆధారంగా ఈడీ విచారిస్తుంది. గతంలో ఎక్సైజ్ అధికారుల ముందు తనకెమి తెలియనట్టు నాటకం ఆడిన డ్రగ్ డీలర్ ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కేసులో అలెర్ట్ అయ్యాడు. ఈడీ కేసుతో అప్రూవల్‌గా మారాడు. దాంతో సినీతారల చిట్టాను ఈడీకి ఇచ్చాడు డ్రగ్ డీలర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆ సమాచారంతోనే సినీ తారాలకు నోటీసులు ఇచ్చింది. కెల్విన్ బ్యాంకు ఖాతాలోకి భారీగా పంపినట్టు ఈడీ గుర్తించింది. కెల్విన్ స్టేట్‌మెంట్ ఆధారంగానే ఈడీ నోటీసులు ఇచ్చింది.. కెల్విన్ బ్యాంకుకు డబ్బులు పంపిన సినీ తారల బ్యాంక్ అకౌంట్‌లను ఫ్రీజ్ చేసే ఆలోచనలో ఈడీ ఉన్నట్టు తెలుస్తోంది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story