Bigg Boss 5 Telugu: సరికొత్త టాస్క్ లతో అలరించబోతున్న బిగ్ బాస్ సీజన్ 5

New Tasks in Bigg Boss Telugu Season 5
x

Bigg Boss 5 Telugu: సరికొత్త టాస్క్ లతో అలరించబోతున్న బిగ్ బాస్ సీజన్ 5

Highlights

Bigg Boss 5 Telugu: ఇప్పటికే తెలుగు అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ విజయవంతంగా నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది.

Bigg Boss 5 Telugu: ఇప్పటికే తెలుగు అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ విజయవంతంగా నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. తాజాగా ఇప్పుడు నిర్మాతలు ఈ షో ఐదవ సీజన్ ను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు బిజీగా ఉన్నారు. అయితే ఇంతకుముందు సీజన్స్ టిఆర్పి చూస్తే ప్రతి సీజన్ కి తగ్గుతూ వచ్చింది. కాబట్టి బిగ్ బాస్ సీజన్ 5 టీఆర్పీ తగ్గే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నిర్మాతలు ఒక ఆసక్తికరమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 5 టీఆర్పీ పెంచేందుకు నిర్మాతలు కొన్ని విభిన్నమైన టాస్కులతో ప్రేక్షకులను అలరించనున్నారు అని సమాచారం అందుతోంది.

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ గా ఏ సెలబ్రిటీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లనున్నారు అని ఇంకా తెలియాల్సి ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈసారి మాత్రం కంటెస్టెంట్ లను ముప్పతిప్పలు పెట్టి ప్రేక్షకులను అలరించాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఆ టాస్కులు చూసి ప్రేక్షకులు సైతం ఖంగుతింటారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అసలు ఈ సీజన్ లో పాల్గొనబోతున్న కంటెస్టెంట్స్ ఎవరు?, వారు చేసే టాస్క్ ఎలా ఉండబోతున్నాయి అని తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే. బిగ్ బాస్ మూడు నాలుగు సీజన్ లకు హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున ఈ సీజన్ కు కూడా హోస్ట్ గా కనిపించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories