Bimbisara 2: కళ్యాణ్ రామ్ కోసం రాకాసి పాత్రలో స్టార్ హీరోయిన్?

New Surprise in Kalyanrams Bimbisara 2
x

Bimbisara 2: కళ్యాణ్ రామ్ కోసం రాకాసి పాత్రలో స్టార్ హీరోయిన్?

Highlights

Bimbisara 2: చాలాకాలం తర్వాత "బింబిసారా" సినిమాతో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఒక మంచి హిట్ ను అందుకున్నారు.

Bimbisara 2: చాలాకాలం తర్వాత "బింబిసారా" సినిమాతో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఒక మంచి హిట్ ను అందుకున్నారు. మల్లిడి వశిష్ట అనే ఒక కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో విడుదలై మైథిలాజికల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి మంచి టాక్ ను అందుకుంటుండగా, ఈ సినిమాకు ఖచ్చితంగా సీక్వెల్ కూడా ఉండబోతోంది అని దర్శక నిర్మాతలు ఇప్పటికే ప్రకటించేశారు.

ఈ నేపథ్యంలో "బింబిసారా 2" కథ ఎలా ఉండబోతోంది, అందులో నందమూరి కళ్యాణ్ రామ్ పాత్ర ఎలా ఉండబోతోంది అనే విషయాలపై పలు పుకార్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక ప్రముఖ స్టార్ హీరోయిన్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించబోతోంది అని వార్తలు వినిపించాయి. ఈ సినిమాలోని రాకాసి పాత్రలో స్టార్ హీరోయిన్ నటిస్తుందని టాక్ నడిచింది.

కానీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ పుకార్లపై స్పందించారు మల్లిడి వశిష్ట. అసలు "బింబిసారా 2" సినిమాకి సంబంధించి కథ ఇంకా పూర్తి కాలేదని ఇక సినిమా కథ గురించి, హీరోయిన్ రాకాసి పాత్రలో కనిపించడం గురించి వస్తున్న పుకార్లలో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇక "బింబిసారా" సినిమా మంచి హిట్ అవడంతో "బింబిసారా 2" పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories