New Movie: శ్రీకాంత్ అడ్డాల పెద కాపు-1. వైరల్ అవుతున్న ఫస్ట్ లుక్

New Movie: శ్రీకాంత్ అడ్డాల పెద కాపు-1. వైరల్ అవుతున్న ఫస్ట్ లుక్
x

New Movie: శ్రీకాంత్ అడ్డాల పెద కాపు-1. వైరల్ అవుతున్న ఫస్ట్ లుక్

Highlights

విరాట్ కర్ణకు హీరోగా పరిచయం చేస్తూ శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న తన కొత్త చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసుకున్నాడు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో హీరో భారీ జనసమూహంలో విజయానికి గుర్తుగా అభివాదం చేస్తూ కనిపించాడు. ఇక ఈ సినిమాకు పెద కాపు-1 టైటిల్ ను ఫిక్స్ చేశారు. అదే ఇప్పుడు సెన్సేషన్ గా మారింది.

Peda Kapu-1: శ్రీకాంత్ అడ్డాల ఈ పేరు చెప్పగానే కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలు గుర్తుకు వస్తాయి. ఈ రెండు చిత్రాలతో టాలీవుడ్ దృష్టిని తనవైపు తిప్పుకున్న ఈ డైరెక్టర్ ఆ తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ ని గ్రాండ్ గా లాంఛ్ చేశాడు. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేపోయినా ఒక సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఇక తర్వాత మహేష్ బాబుతో చేసిన బ్రహ్మోత్సవం శ్రీకాంత్ అడ్డాల కెరీర్ లోనే బిగెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.

బ్రహ్మోత్సవం దెబ్బ నుంచి కోలుకోవడానికి శ్రీకాంత్ అడ్డాలకు చాలా టైం పట్టింది. ఆ తర్వాత ఆయన వెంకటేష్ తో నారప్ప సినిమా చేశాడు. ఇది ఓటీటీకే పరిమితం కావడంతో శ్రీకాంత్ అడ్డాలకు రావాల్సినంత పేరు రాలేదు. కానీ, ఈ సినిమాతో ఇండస్ట్రీలో కొనసాగే వీలైతే చిక్కిందనే చెప్పాలి. ఇదిలా ఉంటే శ్రీకాంత్ అడ్డాల దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత తెరకెక్కిస్తున్న సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ తో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు.

విరాట్ కర్ణకు హీరోగా పరిచయం చేస్తూ శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న తన కొత్త చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసుకున్నాడు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో హీరో భారీ జనసమూహంలో విజయానికి గుర్తుగా అభివాదం చేస్తూ కనిపించాడు. ఇక ఈ సినిమాకు పెద కాపు-1 టైటిల్ ను ఫిక్స్ చేశారు. అదే ఇప్పుడు సెన్సేషన్ గా మారింది. అలాగే పోస్టర్ లో ఓ సామాన్యుడి సంతకం అనే ట్యాగ్ లైన్ క్యూరియాసిటీని పెంచే విధంగా ఉంది.

పెదకాపు-1 చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. మొత్తంగా, ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే శ్రీకాంత్ అడ్డాల ఏదో ప్రయోగం చేస్తున్నట్లే ఉంది. టైటిల్ ఒక కులం పేరుతో ఉన్నందున..అసలు కథ ఏమై ఉంటుందనే చర్చ మొదలైంది. మరి, ఈ సినిమా ఎలాంటి వివాదాలకు దారితీస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories