సరికొత్త అవతారాలలో ప్రభాస్, శ్రద్ధ

సరికొత్త అవతారాలలో ప్రభాస్, శ్రద్ధ
x
Highlights

'బాహుబలి' సినిమాతో ప్యాన్ ఇండియన్ గా మారిన ప్రభాస్ తదుపరి సినిమా 'సాహో' కోసం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ ఫ్యాన్స్ అందరు...

'బాహుబలి' సినిమాతో ప్యాన్ ఇండియన్ గా మారిన ప్రభాస్ తదుపరి సినిమా 'సాహో' కోసం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ ఫ్యాన్స్ అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటించింది. గత ఏడాది ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా షేడ్స్ ఆఫ్ సాహో లోని మొదటి చాప్టర్ ను విడుదలచేసిన దర్శక నిర్మాతలు ఈ రోజు శ్రద్ధ కపూర్ పుట్టినరోజు సందర్భంగా రెండవ చాప్టర్ ను విడుదల చేశారు. నిమిషం నిడివి గల ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గ్లామర్ పరంగానే కాక యాక్షన్ పరంగా కూడా శ్రద్ధ కపూర్ ఈ సినిమా లో అదరగొట్టింది అని చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో ప్రముఖ హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ఈ చిత్రానికి యాక్షన్ ఎపిసోడ్ లు చిత్రీకరిస్తున్న సన్నివేశాలు, 37 కు పైగా కార్లను వినియోగించి 60 రోజుల ప్రిపరేషన్ తర్వాత 30 రోజులు షూటింగ్ చేసి యాక్షన్ సన్నివేశాలను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో లో శ్రద్ధ కపూర్ గన్నుతో పేల్చడం హైలెట్ అని చెప్పుకోవచ్చు. నీల్ నితిన్ ముఖేష్, మందిరా బేడీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా ఆగస్టు 15 వ తారీకున హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories