ఏప్రిల్ లో విడుదలకు సిద్దమవుతున్న సినిమాలు

*ఏప్రిల్ లో విడుదలకు సిద్దమవుతున్న సినిమాలు

Rama Rao
Updated on: 6 April 2022 6:00 PM IST
New Films are Set to Release in April | Tollywood News
X

ఏప్రిల్ లో విడుదలకు సిద్దమవుతున్న సినిమాలు 

New Movies: కరోనా కారణంగా చాలా సినిమాలు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. కొన్ని సినిమాల షూటింగులు కూడా ఆగిపోయి విడుదలలు వాయిదా వేయాల్సి వచ్చింది. అలా వాయిదా పడ్డ సినిమాలు అన్నీ ఇప్పుడు వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే "రాధే శ్యామ్", " భీమ్లా నాయక్", "అర్ఆర్ఆర్" వంటి సినిమాలు భారీ అంచనాల మధ్య విడుదలై ప్రేక్షకులను అలరించాయి. తాజాగా ఇప్పుడు ఏప్రిల్ లో కూడా పలు ఆసక్తికరమైన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అందులో మొదటగా ఏప్రిల్ మొదటి వారం లో విడుదల కాబోతున్న సినిమా వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న "గని".

స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 8న విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఎప్పటి నుంచో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న "కే జి ఎఫ్: చాప్టర్ 2"ఏప్రిల్ 14న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఏప్రిల్ 3వ వారంలో నాగ శౌర్య హీరోగా నటిస్తున్న "కృష్ణ వ్రింద విహారి" మరియు యాంకర్ సుమ నటిస్తున్న "జయమ్మ పంచాయితీ" ఏప్రిల్ 22 న విడుదల కాబోతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న "ఆచార్య" సినిమా ఏప్రిల్ 29 లేదా మే 13 న విడుదల కాబోతోంది.

Rama Rao

Rama Rao

Next Story