"శాకుంతలం" నిర్మాతలకి వచ్చి పడిన కొత్త ఇబ్బందులు

Shaakuntalam: సమంత సినిమాకి బయర్లు దొరకడం లేదా?

Jyothi
Updated on: 9 April 2023 8:30 PM IST
New Difficulties Faced by the Producers of Shaakuntalam Movie
X

"శాకుంతలం" నిర్మాతలకి వచ్చి పడిన కొత్త ఇబ్బందులు

Shaakuntalam: "యశోద" సినిమాతో మంచి హిట్ అందుకున్న స్టార్ బ్యూటీ సమంత తాజాగా ఇప్పుడు గుణశేఖర్ దర్శకత్వంలో "శాకుంతలం" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఏప్రిల్ 14న థియేటర్లలో విడుదల కాబోతోంది. ప్రముఖ నటుడు దేవ్ మోహన్ ఈ సినిమాలో హీరోగా దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు దుర్వాస మహర్షి పాత్రలో కనిపించబోతుండగా, అదితీ బాలన్, అనన్య నాగళ్ళ, ప్రకాష్ రాజ్, గౌతమి, జిషు సేన్ గుప్తా, సచిన్ ఖెడేకర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా కీలక పాత్రలో కనిపించబోతోంది. 2015లో రుద్రమదేవి సినిమా తర్వాత గుణశేఖర్ ఇప్పటిదాకా ఒక్క సినిమా కూడా చేయలేదు. దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని అనుమానాలు రేకెత్తుతున్నాయి. విడుదల కి ఇంకా వారం కూడా లేదు కానీ ఇంకా థియేట్రికల్ బిజినెస్ పూర్తి కాలేదు. భారీ మొత్తాన్ని పెట్టి బయలు సినిమాను కొరుగోలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. దీంతో చిత్ర బృందం సినిమాని భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తోంది.

పైగా సినిమా త్రీడీలో కూడా రూపొందుతోంది అని ప్యాన్ ఇండియా సినిమా అని ప్రచారం జరుగుతోంది. అయినా కూడా డిస్ట్రిబ్యూటర్లు మరియు ఎగ్జిబిటర్లు సినిమాపై ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. ఈ సినిమా కోసం దిల్ రాజు భారీ బడ్జెట్ పెట్టారు. కానీ చూస్తూ ఉంటే సినిమా థియేటర్ బిజినెస్ చాలా తక్కువ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నీలిమ గుణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించారు.

Jyothi

Jyothi

Next Story