Jabardasth: ఎట్టకేలకు జబర్దస్త్‌కి కొత్త యాంకర్.. అసలు ఎవరీ సౌమ్య రావు..!

Jabardasth: జబర్దస్త్ షో అనగానే అందరికీ గుర్తొచ్చేది అనసూయ.

Arun Chilukuri
Published on: 8 Nov 2022 3:01 PM IST
New Anchor Somya Rao Entered Jabardasth
X

Jabardasth: ఎట్టకేలకు జబర్దస్త్‌కి కొత్త యాంకర్.. అసలు ఎవరీ సౌమ్య రావు..!

Jabardasth: జబర్దస్త్ షో అనగానే అందరికీ గుర్తొచ్చేది అనసూయ. గత పదేళ్లుగా జబర్దస్త్ కామెడీ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న అనసూయ ఈ షో వల్లనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఇప్పుడు సినిమాలతో కూడా బిజీ అయిన ఈ భామ జబర్దస్త్ కి వీడ్కోలు పలికింది. మరోవైపు అనసూయ స్థానంలో జబర్దస్త్ షోకు కొత్త యాంకర్ వస్తుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉండగా ఎట్టకేలకు సౌమ్యా రావు అనే కొత్త యాంకర్ తెరమీదకు వచ్చింది.

తాజాగా వదిలిన ప్రోమోలో సౌమ్య రావుని జబర్దస్త్ జడ్జ్ ఇంద్రజ పరిచయం చేసినట్లు చూపించారు. ఈ కొత్త యాంకర్‌పై వచ్చి రాగానే హైపర్ ఆది పంచులు విసిరాడు. కృష్ణ భగవాన్ కూడా ఆమెపై పంచులేయడం.. దానికి అమే రివర్స్ కౌంటర్లు ఇవ్వడంతో ఈ వీడియో వైరల్ గా మారింది. సౌమ్య రావు.. కర్ణాటకలోని శివమొగ్గలో 1990 సెప్టెంబర్‌ 29న జన్మించింది. బెంగళూరులో చదువు పూర్తి కాగానే ఓ కన్నడ న్యూస్‌ ఛానల్‌లో యాంకర్‌గా పనిచేసింది. ఆ తర్వాత మోడల్‌గానూ రాణించింది. నటనపై ఆసక్తితో అవకాశాల కోసం ప్రయత్నించి..'పట్టేదారి ప్రతిభ' అనే కన్నడ సీరియల్‌తో బుల్లితెరకు పరిచయమైంది. ఆ సీరియల్‌ హిట్‌ కావడం.. తన నటనకు మంచి గుర్తింపు లభించడంతో తమిళ టీవీ సీరియల్స్‌లోనూ అవకాశాలు వచ్చాయి.

తెలుగులోనూ ఈటీవీలో ప్రసారమయ్యే 'శ్రీమంతుడు' సీరియల్‌లో నటిస్తూ తెలుగు వారికి బాగా దగ్గరైంది. ఇటీవల ఈటీవీలోనే ఓ స్పెషల్‌ షోలో పాల్గొన్న సౌమ్య.. కమెడియన్‌ హైపర్‌ఆది, ఆటో రామ్‌ప్రసాద్‌పై వరుస పెట్టి పంచులేసి అందరి దృష్టిని ఆకర్షించింది. 'జబర్దస్త్‌'కి కొత్త యాంకర్‌ కోసం అన్వేషిస్తున్న షో నిర్వాహకులు సౌమ్య టాలెంట్‌ను గుర్తించి యాంకర్‌గా తీసుకున్నారు. అందం, అభినయంతో సీరియల్స్‌లో అదరగొడుతున్న ఈ నటి.. యాంకర్‌గా ఎంతమేరకు మెప్పిస్తుందో చూడాలి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story