స్కూల్ ఫీజుకి డబ్బులు లేవని ఏడ్చి.. బిఎమ్ డబ్ల్యు కారు కొన్నావేంటి విశ్వా..!!

* బిగ్ బాస్ విశ్వా సోషల్ మీడియా పోస్ట్ పై నెటిజన్ల ట్రోలింగ్

Sandeep Reddy
Updated on: 29 Nov 2021 4:42 PM IST
Netizens Trolls Bigg Boss Contestant Vishwa About the Latest Social Media Post
X

స్కూల్ ఫీజుకి డబ్బులు లేవన్నాడు.. బిఎమ్ డబ్ల్యు కారు కొన్నాడు(ఇంస్టాగ్రామ్ ఫోటో)

Bigg Boss Vishwa: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో కంటెస్టెంట్‌ గా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇటీవల ఎలిమినేట్ అయిన విశ్వాపై నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్స్ తో చుక్కలు చూపిస్తున్నారు. నటుడిగా అటు సినిమాలతో పాటు సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వా బిగ్ బాస్ లోకి వెళ్ళే ముందు వరకు సరైన అవకాశాలు లేక ఆర్ధికంగా ఎన్నో కష్టాలు పడినట్లు బిగ్ బాస్ హౌస్ లో బాధపడిన సంగతి తెలిసిందే.

తన పిల్లల స్కూల్ ఫీజు కూడా డబ్బులు లేవని తన తోటి కంటెస్టంట్స్ తో చెబుతూ కన్నీళ్ళు పెట్టుకున్న విశ్వా తాజాగా బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక బిఎమ్ డబ్య్లు కారుని కొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. పిల్లల ఫీజు కూడా డబ్బులు లేవని చెప్పి అంత ఖరీదైన కారు కొనడానికి కారణమేంటో చెప్పాలని.. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఆ విషయం చెబుతూ బాధపడటం అంతా అబద్దమా లేదా స్కూల్ ఫీజు కూడా లేవని లక్షలు విలువ చేసే కారు కొనడం వెనుక బిగ్ బాస్ విశ్వా ఒక్కడికే కళ్ళు చెదిరే రెమ్యునరేషన్ ఇచ్చాడా అంటూ రకరకాల ప్రశ్నలతో ట్రోల్ చేస్తున్నారు.

ప్రస్తుతం విశ్వా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కారు విలువ సుమారుగా 60 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఇక అతడి పోస్ట్ కి పలువురు నెటిజన్లు తమదైన స్టైల్ లో కామెంట్స్ చేశారు. అందులో పిల్లల స్కూల్ ఫీజుకి డబ్బులు లేవనాలి.. తినడానికి తిండి లేదు అనాలి.. బయటికి వచ్చాక మాత్రం బిఎమ్ డబ్య్లు కారులో తిరగాలని ఒకరు కామెంట్ చేయగా.. పిల్లల ఫీజుకు డబ్బులు లేవు అన్నందుకు బాధగా ఉన్నా.. బిఎమ్ డబ్య్లు కారుతో రిచ్ గా చూడటం ఆనందంగా ఉందంటూ కామెంట్స్ చేశారు.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story